వాళ్లని జైలుకు పంపించేందుకు 12 ఏళ్లు పోరాడా.. అల్లు అరవింద్

చిరంజీవిపై నాకున్న అభిమానం ఇదే

By :  Lenin
Update: 2023-08-07 05:04 GMT


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - డైరెక్టర్ మెహర్ రమేశ్ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం భోళాశంకర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను ఆదివారం హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు మూవీమేకర్స్. ఈ ఈవెంట్​కు పలువురు టాలీవుడ్ దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అందరూ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగితే.. నేను మాత్రం ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగా. ఆయనంటే నాకెంతో ఇష్టం. ఒకరు ఆయన గురించి తప్పుగా మాట్లాడినందుకు.. 12 ఏళ్లు పోరాడి వారికి శిక్ష పడేదాకా నేను ఊరుకోలేదు" అని అన్నారు.

అయితే ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవో అందరికీ తెలిసిన విషయమే. 2011లో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పటిలో నిర్మాత అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. వారి పై కోర్ట్ లో పరువు నష్టం దావా కూడా వేశారు. దాదాపు 12 ఏళ్ళ పాటు ఈ కేసు పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. జీవిత, రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడం, వారు అన్నారని ప్రూవ్ అవ్వడంతో వారిద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తు తీర్పునిచ్చింది.

ఈ విషయంపై ఇప్పటి వరకు మెగా కుటుంబం నుంచి ఎవరు మాట్లాడలేదు. కేసు వేసిన అల్లు అరవింద్ కూడా మీడియా ముందు ఎక్కడ నోరు విప్పలేదు. తాజాగా భోళా శంకర్ (Bholaa Shankar) ప్రీ రిలీజ్ వేదిక పై మాట్లాడుతూ.. “నేను ఇక్కడికి వచ్చింది సినిమా సక్సెస్ కావాలని చెప్పడానికి కాదు. ఎందుకంటే ఆయన చూడని బ్లాక్ బస్టర్ లేవు, ఆయన చూడని కలెక్షన్స్ లేవు. మీరు ఆయన సినిమాలు చూస్తూ అభిమానులు అయ్యి ఉంటారు. కానీ నేను ఆయనతో సినిమాలో చేస్తూ అభిమానిని అయ్యాను. ఆ అభిమానం ఎలాంటిది అంటే.. ఆయన్ని పై తప్పుడు మాటల మాట్లాడినందుకు వాళ్ళని జైలుకి పంపించేందుకు 12 ఏళ్ళు పాటు పోరాడాను. అది నా అభిమానం” అన్నారు అల్లు అరవింద్ .


Tags:    

Similar News