డైరెక్టర్ పరశురామ్పై అల్లు అరవింద్ సెటైర్లు.. అసలేం జరిగింది

Update: 2023-06-01 11:00 GMT

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ 2018 సినిమాపై ప్రశంసలు కురిపించారు. బుధవారం అమెరికా నుంచి వచ్చిన ఆయన.. రాగానే 2018 సినిమా చూశారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి.. 2018 అందరూ చూడాల్సిన సినిమా అని అన్నారు. సినీ పరిశ్రమ వాళ్లు కూడా తప్పకుండా థియేటర్లకు వెళ్లి చూడాలని కోరారు. ఈ సినిమాలో కేవలం ఎమోషన్ మాత్రమే ఉందని.. ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన హంగులు ఏవీ ఇందులో లేకపోయినా.. సినిమా సూపర్ హిట్ అయిందని అన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డైరెక్టర్ పరుషురామ్ కు చురకలు అంటించారు.

డైరెక్టర్ చందు మొండేటి గురించి మాట్లాడుతూ. ఆయన 3 సినిమాలు గీత ఆర్ట్స్ తో చేస్తున్నాడని చెప్పారు. కార్తికేయ 2 రిలీజ్ కాకముందే చందు గొప్ప డైరెక్టర్ అవుతాడని గుర్తించినట్లు అల్లు అరవింద్ అన్నారు. ఈ మధ్యకాలంలో చందుకు పెద్ద ఆఫర్స్ వచ్చినా వాటన్నింటినీ వదులుకుని.. తనకిచ్చిన కమిట్మెంట్ కు లోబడి ఉన్నారన్నారు. గీతా ఆర్ట్స్ తో సినిమాలు పూర్తయిన తర్వాత వేరే సినిమాలు చేస్తానని చందు చెప్పిన విషయం గుర్తుచేశారు.

కొందరు ఇచ్చిన కమిట్మెంట్ ను మర్చిపోయి.. వేరే నిర్మాతలకు ఒప్పుకుంటారని.. పరోక్షంగా పరుషురామ్ గురించి అన్నారు. పరుశురామ్ గీతా ఆర్ట్స్ తో సినిమా చేయాల్సి ఉండగా.. దిల్ రాజ్ కు సినిమా చేస్తానని చెప్పి అధికారికంగా ప్రకటించాడు. దీనిపై అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా అనగా.. కొందరు సినీ పెద్దలు అరవింద్ కు సర్దిచెప్పి సరిపెట్టారు. అరివింద్ కు ఇప్పుడు చాన్స్ రాగా.. పరోక్షంగా సెటైర్లు వేశారు.


Tags:    

Similar News