ఆదిపురుష్లో అల్లు అర్జున్.. ఏ క్యారెక్టర్ చేశాడంటే..!

Update: 2023-06-16 10:43 GMT

భారీ అంచానల నడుమ విడుదైన ఆదిపురుష్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. స్టోరీ నరేషన్ పరంగా డిసప్పాయింట్ చేసినా.. పాటలు, గ్రాఫిక్స్ విజువల్స్ కోసం సినిమాకు వెళ్లొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్, క్రితి సనన్, సైఫ్ అలీ ఖాన్.. ఇలా చాలామంది స్టార్స్ నటించారు. అయితే, అల్లు అర్జున్ ఇందులో ఓ క్యారెక్టర్ పోషించాడని ఎప్పుడూ రివీల్ చేయలేదు. థియేటర్లో సినిమా చూసిన ఆడియన్స్.. ఒక వానరం క్యారెక్టర్ ను ట్యాగ్ చేస్తూ.. ‘సినిమాలో అల్లు అర్జున్ ఉన్నాడు. ముందు చెప్తే, సినిమాకు ఇంకా హైప్ పెరిగేది కదా’ అని కామెంట్ పెట్టారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటో కూడా అచ్చం అల్లు అర్జున్ ముఖాన్ని పోలి ఉంది. దాంతో ఆడియన్స్ అది నిజమేనని.. అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్ చేశాడని నమ్ముతున్నారు. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. సినిమాలో అల్లు అర్జున్ నటించలేదని.. వానరావతారంలో ఉన్నది వేరొక యాక్టర్ అని క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా ఆదిపురుష్ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాడు. సినిమా నచ్చని చాలామంది.. మీమ్స్ చేస్తూ ట్యాగ్ చేస్తున్నారు.

Tags:    

Similar News