ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అమీర్‌పేట్‌లో నిర్మించిన అత్యాధునిక మల్లీప్లెక్స్‌ను అల్లు అర్జున్ లాంఛనంగా ప్రారంభించారు. . ఈ మల్టీప్లెక్స్‌ను ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మించారు. ఏషియన్ సత్యం మాల్ అండ్ మల్టీప్లెక్స్ పేరిట నిర్మించిన ఈ మాల్‌లో AAA సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు. అల్లు అర్జున్ పేరు వచ్చేలా ఏషియన్ అల్లు అర్జున్ సినిమా.. షార్ట్‌కట్‌లో AAA సినిమాస్ అని దీనికి పేరు పెట్టారు. ఈ AAA సినిమాస్‌లో సునీల్ నారంగ్, అల్లు అర్జున్ భాగస్వాములు.
ఈ మల్టిప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్, నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన మల్టీప్లెక్స్ చాలా ప్రత్యేతకలు ఉన్నాయి. ఈ మల్టీప్లెక్స్‌లోని AA ICON లాంజ్‌లో అల్లు అర్జున్ సాధించిన అవార్డులు, నటించిన మూవీ పోస్టర్‌లు, అల్లు అర్జున్ ఫ్యామిలీ గ్యాలరీ , ఆయన నటించిన మూవీ డైరెక్టర్స్ చిత్రాలు ఉన్నాయి. కాగా, అల్లు అర్జున్ రాకతో అమీర్‌పేటలోని సత్యం థియేటర్ ఏరియా జనసంద్రమైంది. అల్లు అర్జున్‌ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. అల్లు అర్జున్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు సత్యం థియేటర్ నుంచి బయటికి రాగానే దాన్ని బన్నీ అభిమానులు చుట్టుముట్టారు. బన్నీ సన్ రూఫ్ నుంచి బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.
ఈనెల 16న రిలీజ్ కానున్న ప్రభాస్ ఆదిపురుష్ ఈ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ టికెట్స్ భారీస్థాయిలో బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే టాలీవుడ్‌లో మహేష్ బాబు, ప్రభాస్, విజయ దేవర కొండ మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాణ సంస్థతో 'AMB' థియేటర్‌ను మహేష్ నిర్మించగా.. విజయ్ దేవర కొండ 'AVD' నిర్మించాడు. ప్రభాస్ మాత్రం తన స్నేహితులతో కలిసి ఒక థియేటర్‌ను నిర్మించాడు. తాజాగా అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరిపోయాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్, 800 జూబ్లీ అనే పబ్‌ను నడిపిస్తున్నాడు బన్నీ.
#AlluArjun fans hungama at #AAACinemas launch as Allu Arjun visits the multiplex at Ameerpet!
— idlebrain.com (@idlebraindotcom) June 15, 2023
The theatre complex will start with #Adipurush screening in all 5 screens tomorrow! pic.twitter.com/qvTD8IcA1W
AA ICON lounge in #AAAcinemas has awards, frame movie posters, Allu Arjun family gallery and AA’s directors pix. It’s open for all visitors or AAA Cinemas in Asian Satyam Mall. #AlluArjun https://t.co/APGar355Zt pic.twitter.com/A7wm0RXf8E
— idlebrain jeevi (@idlebrainjeevi) June 14, 2023