Allu Arjun: లండన్లో అల్లు అర్జున్.. ఫొటోలు వైరల్..

By :  Krishna
Update: 2023-09-28 14:28 GMT

అల్లు అర్జున్.. జాతీయ అవార్డు అందుకున్న టాలీవుడ్ మొట్టమొదటి హీరో. పుష్ప మూవీలో నటనకు గానూ ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పుష్ప రాజ్గా అల్లు అర్జున్ యాక్టింగ్కు అందరు ఫిదా అయ్యారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024 అగస్ట్ 15న ఈ మూవీ విడుదల కానుంది. అయితే పుష్ప 2 షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన బన్నీ.. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు.

ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు అల్లు అర్జున్. సెప్టెంబర్ 29న తన వైఫ్ స్నేహ బర్త్ డే సెలబ్రేషన్స్ను బన్నీ గ్రాండ్గా చేయనున్నారు. దీన్ని కోసమే ఆయన యూకే వెళ్లినట్లు తెలుస్తోంది. లండన్ లో దిగిన ఫొటోలను బన్నీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్రే కలర్ సూట్లో, స్టయిలిష్ కళ్లజోడుతో బన్నీ మెరిసిపోతున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ఫొటోలు వైరల్గా మారాయి. అక్టోబరు ఫస్ట్ వీక్లో బన్నీ హైదరాబాద్కు తిరిగిరానున్నారు.



Tags:    

Similar News