ఇండియన్ సినిమాలో అల్లు అర్జున్ కొత్త రికార్డు

Update: 2023-08-13 11:30 GMT

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప, గతేడాది వచ్చిన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. అర్జున్ తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా సంపాదించింది. ఇప్పుడు అభిమానులు పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప భారీ విజయం సాధించడంతో పుష్ప2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప -2 నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. బన్నీ బర్త్‌డే సందర్భంగా పుష్ప 2 మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ట్రెండ్ చేసింది.

అమ్మవారి అవతారంలో అల్లు అర్జున్‌‎ను చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఈ పోస్టర్ వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టర్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు మిలియన్‌ల లైక్‌లు సాధించిన తొలి ఇండియన్‌ సినిమా పోస్టర్‌గా పుష్ప-2 ఆల్‌ టైమ్‌ నేషన్‌ వైడ్‌ రికార్డును నెలకొల్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భారతీయ సినిమాకు ఇంత పెద్దఎత్తున లైక్స్ రావడం ఇదే తొలిసారి.

ఎలాంటి అంచనాల్లేకుండా హిందీలో విడుదలైన పుష్ప అక్కడ కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో బన్నీ తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు.ఎలాంటి అంచనాల్లేకుండా హిందీలో విడుదలై అక్కడ కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో బన్నీ తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు.


Tags:    

Similar News