అల్లు అర్జున్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్..

By :  Kiran
Update: 2023-09-11 11:21 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఆ సినిమాకు సీక్వెల్గా పుష్ప-2 తెరకెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ భారీ అప్ డేట్ ఇచ్చింది. పుష్ప-2 సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. బాక్సాఫీసు ఏలేందుకు పుష్పరాజ్ మరోసారి వస్తున్నాడంటూ మైత్రీ మూవీ మేకర్స్ తన సోషల్ మీడియో పోస్టులో రాసింది.

పుష్ప ది రైజ్‌లో అల్లు అర్జున్‌ను సుకుమార్‌ డీ గ్లామర్‌గా కనిపించడంతో పాటు తన నటనతో ఈ సినిమాను నిలబెట్టాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి నటుడిగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్ అంటూ చెప్పిన డైలాగులు ప్యాన్ ఇండియా లెవల్లో పేలాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ సరికొత్త లుక్ లో కనిపించాడు.

ఫుష్ప 2 మూవీకి సంబంధించిన క్లైమాక్స్ ‌మినహా షూటింగ్ పార్ట్ కంప్లీటైనట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్‌లో రష్మిక డెత్ సీక్రెట్ రివీల్ చేసే సన్నివేశాలను రాజమండ్రితో పాటు తిరుపతితో పాటు మలేషియాలోని అడవుల్లో చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఈ క్లైమాక్స్ నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంటుందనేది ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.



Tags:    

Similar News