పవన్ సినిమా నుంచి ఆ డైరెక్టర్ అవుట్..కొత్త డైరెక్టర్ ఎవరంటే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఐదేళ్ల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా ప్రకటించారు. ఆ మూవీ డైరెక్షన్ బాధ్యతలు క్రిష్ తీసుకున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ ఎం.రత్నం ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చాలా పవన్ చాలా సినిమాలకు సైన్ చేశారు. అందులోక కొన్ని థియేటర్లలో విడుదలయ్యాయి కూడా. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీ మాత్రం ఇంత వరకూ విడుదల కాలేదు. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దాదాపు 60 శాతం షూటింగ్‌ను హరిహర వీరమల్లు మూవీ పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఈ మూవీ విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. ఈ మూవీ ఆగిపోయిందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఫిలింనగర్లో ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్నాడని తెలుస్తోంది. ఎక్కువ కాలం ఈ ప్రాజెక్టులో ఉండిపోవడం వల్ల ఇతర సినిమాలు చేయలేకపోతున్నందుకు, ఈ సినిమాకు తాను పనిచేయలేనని క్రిష్ చెప్పేశాడట.
మరో కథ ప్రిపేర్ చేసుకుని అనుష్క హీరోయిన్‌గా యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగిపోయిన హరిహర వీరమల్లు సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎం.రత్నం కొడుకు జ్యోతి కృష్ణ తీసుకోనున్నట్లు సమాచారం. ఇకపోతే దర్శకుడిగా జ్యోతి కృష్ణ గతంలో ఆక్సిజన్ అనే సినిమాను తీశారు. ఆ తర్వాత రూల్స్ రంజన్ తో ఈ మధ్యే వచ్చాడు. ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసి తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు.