గుడ్ న్యూస్ చెప్పిన అమలాపాల్.. అప్పుడేనా అంటూ నెటిజన్ల సటైర్..
అమలాపాల్.. సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. మైనా మూవీతో కెరీర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి చిత్రానికే జాతీయ అవార్డు అందుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తదితర భాషల్లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే తమిళ డైరెక్టర్ విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మరొకరితో ప్రేమలో పడ్డ ఈ ముద్దుగుమ్మ.. అతన్ని మనువాడుతుందని అంతా అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రియుడిపై చీటింగ్ కేసు పెట్టి పోలీసులకు అప్పగించింది.
బ్రేకప్ తర్వాత పలు సినిమాలు, వెబ్ సరీస్ లలో నటించిన అమలా పాల్ గతేడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకుంది. 2023 జూన్ నుంచి డేటింగ్ లో ఉన్న ఈ లవ్ బర్డ్స్.. నవంబర్లో ఒక్కటయ్యారు. పెళ్లై రెండు నెలలు కూడా గడవకముందే ఈ కేరళ కుట్టి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ 1 + 1 = 3 అంటూ ఇన్ స్టాలో పోస్ట్ షేర్ చేసింది. అమలాపాల్ స్టోరీ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు. అదేంటీ పెళ్లై రెండు నెలలే అయిందిగా మూడో నెల కడుపేంటి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవలి కాలంలో ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకోవడం కామనైపోయింది. ప్రస్తుతం ఆ లిస్టులో అమలాపాల్ కూడా చేరింది. ఏదేైమైనా అమలాపాల్ చెప్పిన గుడ్ న్యూస్ కు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక అమలాపాల్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈమె ఆడు జీవితం,ద్విజ సినిమాలలో నటిస్తున్నారు.