ప్రియాంక చోప్రా నటించిన సీటాడెల్ చాలా హైప్ తో విడుదల అయింది. అందరూ ఆ వెబ్ సీరీస్ చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారు...అందరూ దానికోసం వెయిట్ చేశారు కూడా. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. చాలా మంది దానిని చూశారు. సీటాడెల్ ఇండియన్ వెర్షన్ ను రాజ్ అండ్ డీకెలు సమంత తో తీస్తున్నారు కూడా. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే సీటాడెల్ పెద్ద ఫ్లాప్. ఈ విషయాన్ని అమెజాన్ సీఈవో నే స్వయంగా చెప్పారు.
ఒకప్పుడు కేవలం సినిమాలే ఉండేవి. అవి కూడా థియేటర్లలో విడుదల అయ్యేవి. కానీ నెమ్మదిగా పరిస్థితి మొత్తం మారిపోయింది. ఓటీటీలు చాలా ముఖ్యమైపోయాయి అందరి జీవితాల్లో. చాలా మంది థియేటర్లకు వెళ్ళడం మానేసారు. వెబ్ సీరీస్ లను తెగ చూస్తున్నారు. దీంతో ఓటీటీలు కోట్లు పెట్టి మరీ వెబ్ సీరీస్ లు తీస్తున్నాయి. దాని ద్వారా వందల కోట్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. అమెజాన్ ఈ విషయాన్నే ఇప్పుడు బయట పెట్టింది.
ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన అత్యంత ఖరీదైన వెబ్ సీరీస్ సిటాడెల్. ప్రియాంక చోప్రా నటించిన ఈ సీరీస్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. యాక్షన్ ప్రధానాంశంగా దీన్ని తీశారు. దీని కోసం దాదాపు 250 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టామని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ చెప్పారు. కానీ మళ్ళీ ఆయన అన్నీ గంగలో పోసినట్లు అయిందని చెబుతున్నారు. ఇదొక్కటే కాదు డైసీ జోన్స్ అండ్ ది సిక్స్, ది పవర్, డెడ్ రింగ్స్, ది ఫెరిఫెరల్ లాంటి సీరీస్, షోలు కూడా దారుణంగా ఫ్లాప్ అయ్యాయిట. నాలుగు వేలు ఖర్చు పెట్టిన తీసిని లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కూడా నిరాశపర్చిందని జెస్సీ చెప్పుకొచ్చారు. దీన్ని ఇప్పుడు అమెజాన్ సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి వెబ్ సీరీస్ లను ఆపేయాని నిర్ణయించుకుంది. అంతేకాదు ఈ సీరీస్ లు ష్లాప్ అవ్వడానికి కారణమైన ఉద్యోగులను తీసేయాలని కూడా నిర్ణయించుకుంది.