ఆసుపత్రిలో చేరిన అమిత్ బచ్చన్

Byline :  Vamshi
Update: 2024-03-15 10:56 GMT

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమిత్ బచ్చన్ ఆస్పుపత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతుండగా యాంజీయోప్లాస్టీ సర్జరీ కొసం ముంబైలో కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఇక విషయం తెలుసుకున్న బిగ్ బి ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అమితాబ్ వయసు 81 సంవత్సరాలు. ఇప్పటికీ వరుసగా సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటున్నారు.

ఇటీవల కల్కి చిత్రం గురించి అభిమానులతో కొన్ని విషయాలను పంచుకున్నారు బచ్చన్. కల్కి ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే ఈసినిమాకు సంబందించిన అన్ని పనులు పూర్తవుతాయని.. అనుకున్నట్లే మే 9న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. బిగ్ బీ ఆరోగ్యంపై ఆయన కుటుంబం గానీ.. వైద్యులు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో అమితాబ్ ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు

Tags:    

Similar News