ఈ టాలెంట్ అంతా నా కొడుకుదే... అనసూయ హాట్ పిక్స్

Update: 2023-06-16 07:37 GMT

అందాల ఆరబోతలో అనసూయ ఏమాత్రం తగ్గడం లేదు. తనను ఆంటీ అంటూ.. పిచ్చిపిచ్చి కామెంట్స్ చేసి నెటిజన్లకు తన అందాలతో సమాధానమిస్తోంది. ఈ మధ్యే బికినీ ఫొటోలతో కవ్వించిన అనసూయ.. తాజాగా మరోసారి తన అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. థాయిలాండ్‌ బీచ్‌లో తీసుకున్న బికినీ ఫొటోలను తాజాగా షేర్ చేసింది. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తన వెడ్డింగ్ యానివర్సిరీ(జూన్ 4) సందర్భంగా భర్తతో కలసి థాయిలాండ్‌లో ఫుల్ ఎంజాయ్ చేసింది అనసూయ. అప్పుడు బీచ్‌లో బికినీతో దిగిన ఫోటోలను తాజాగా ఫేస్ బుక్ లో షేర్ చేసింది. జూన్ నెల సగం గడిచినా.. పెళ్లి రోజు సందర్భంగా థాయ్‌లాండ్ లో గడిపిన ఆ మధుర క్షణాలను ఇంకా మరిచిపోవడం లేదని, ఆ క్షణాలను కోల్పోవాలని కూడా అనుకోవట్లేదని.. ఆ బికినీ ఫోటోలను మళ్లీ షేర్ చేసింది. ఆ ఫోటోలను తన కొడుకే తీశాడంటూ ఆసక్తికర పోస్ట్ చేసింది. తన కొడుకు సుశాంక్ భరద్వాజ్ టాలెంట్ ఇదేనంటూ ఆ ఫోటోలకు జత చేసింది.



ఓ వైపు యాకంగర్‏గా బుల్లితెరపైన సందడి చేస్తూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‎ను క్రియేట్ చేసుకుంటోంది అనసూయ. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‎గా ఉంటుంది . చాలా విషయాల్లో ఓపెన్‎గా మాట్లాడటమే కాదు ,తనను ట్రోల్ చేసే వారికి గట్టిగానే సమాధానం చెబుతూ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటుంది. అంతకుముందు భర్తతో కలిసి మామిడి తోటలో.. మామిడి పండ్లను కోస్తూ తన వెకేషన్ ను ఎంజాయ్ చేసింది. తోటలో దిగిన ఫోటోలను కూడా నెట్టింట్లో షేర్ చేసింది. ఈ చిత్రాలలో అనసూయ బుల్లి నిక్కరు, స్లీవ్ లెస్ టీ షర్ట్ వేసుకుని కనిపిస్తుంది. భర్త భరద్వాజ్ అనసూయన ఎత్తుకోగా ఆమె మామిడి పండ్లను కోస్తుంటుంది. ఈ పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.




 



 




 




 



 




 



 






 






Tags:    

Similar News