థాయిలాండ్లో అనసూయ రచ్చ.. బీచ్లో యానివర్సరీ సెలబ్రేషన్స్

Update: 2023-06-04 11:27 GMT

యాంకర్ అనసూయ భరధ్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటారో అందరికీ తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని నెట్టింట్లో షేర్ చేస్తుంటుంది. భర్త, పిల్లలతో కలిసి సమ్మర్‌ వెకేషన్‌కి వెళ్లిన అనసూయ.. తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం థాయిలాండ్ బీచ్ లో తన యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా బీచ్ లో దిగిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసింది. ఈ ఫొటోస్ లో అనసూయ హాట్ గా కనిపించడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు ఈ ఫొటోస్ లో అనసూయ మరోసారి బికినీలో కనిపించి అందరికీ షాకిచ్చింది. బీచ్ ఒడ్డున భర్తతో రొమాన్స్ చేసింది. భర్తకు లిప్ లాక్ ఇస్తూ విష్ చేసింది. భర్తపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ.. ఓ స్పెషల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ తమ స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు.

ఓపక్క ఎండలు, ఇలా నువ్వు.. హీట్ పెంచేస్తే ఎలా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక కుర్రజనాలైతే మేడమ్.. మీరు ఎవ్వరేమన్నా.. అస్సలు తగ్గొదు అని కొంటె కౌంటర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్ర‌స్తుతం అనసూయ వరుస సినిమలతో బిజీగా ఉంది. విమానం సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా విడుద‌లకు సిద్దంగా ఉంది.










Tags:    

Similar News