పార్టీలకు వెళ్లనందుకు.. హీరోయిన్ అవకాశాలను కోల్పోయా: అనసూయ
యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తనకు హీరోయిన అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. షూటింగ్స్ పూర్తయ్యాక జరిగే పార్టీలకు తాను చాలా దూరంగా ఉంటానని, అందుకే హీరోయిన్ అవకాశాలను కోల్పోయానని చెప్పింది. ‘ఒకప్పుడు సినిమాలో నా పాత్రకే ప్రాధాన్యం ఉండాలనుకునేదాన్ని. ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్లోనైనా నటించి.. గుర్తింపు తెచ్చుకోగలను అనే నమ్మకం కుదిరింది. సోషల్ మీడియాలో వచ్చేవాటిని పట్టించుకోను. అక్కడ నన్ను విమర్శించే వాళ్లు ఉన్నారు. నా పోస్టులతో స్ఫూర్తి పొందే వాళ్లూ ఉన్నారు’ అని చెప్పుకొచ్చింది.
’అత్తారింటికి దారేదిలో ఇట్స్ టైం టు పార్టీ పాటలో నటించే చాన్స్ వచ్చింది. అందులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. నాకు గుంపులో గోవింద లాగ ఉండటం నచ్చదు. ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటా. అందుకు వాళ్లకు నో చెప్పా. దాంతో చాలామంది విమర్శించారు. మొదటి నుంచి ముక్కుసూటి మనిషిని. అందుకే వాళ్లకు నో చెప్పా. దీంతో ట్విట్టర్ లో పెద్ద వార్ జరిగింది. దాంతో త్రివిక్రమ్ కు సారీ చెప్పా. ప్రతి మహిళ స్వేచ్ఛ కోరుకుంటుంది. నా భర్త నాకా స్వేచ్ఛ ఇచ్చాడు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేవాళ్ల ఇళ్లలోని ఆడవాళ్లను తలుచుకుంటే చాలా జాలేస్తుంది’ అంటూ వివరించింది అనసూయ.