అనసూయ రాజకీయాల్లోకి వస్తుందా?

Update: 2023-08-21 09:56 GMT

ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిన జ్యోతిష్యుడు ఎవరంటే వేణు స్వామి. సెలబ్రిటీలు, సినమాల్లో వ్యక్తుల గురించి జాతకాలు చెబుతూ చాలా పాపులర్ అయిపోయారు ఈయన. చై-సామ్ లు విడిపోతారని చెప్పారు. అలాగే ప్రభాస్ జాతకం కూడా చెప్పి సోషల్ మీడియాలో సంచలనాలకు తెర తీస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్, అనసూయల గురించి సెన్సేషనల్ విషయాలు చెప్పారు వేణు స్వామి.

అనసూయ...ఈమెకో సోషల్ మీడియా బాంబ్. ఏది పెట్టినా తెగ వైరల్ అవుతాయి. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం యాక్టర్ గా బిజీగా మారిపోయిన అన్ను బేబి నిజంగానే ఓ సంచలనం. ఆమె ఈ స్థాయికి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు మరిన్ని విషయాలు అనసూయ గురించి చెబుతున్నారు వేషుస్వామి. 2021 నుంచి ఈమె జాతక్ డ్రాస్టిక్ గా మారిపోయిందట. ఫ్యూచర్ ఆమెదే అని చెబుతున్నారు. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లోకి వెళిపోతుందని...అక్కడ నుంచి రాజకీయాల్లోకి వెళుతుందని జాతకం చెబుతున్నారు వేణుస్వామి.

వేణుస్వామి చెప్పినట్టుగానే 2021 నుంచి అనసూయ జీవితం మారిపోయింది. రంగస్థలం నుంచి ఆమె క్రేజ్ మొత్తం మారిపోయింది. వరుసగా మంచి మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ దూసుకుపోతోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా చెలరేగిపోతోంది అనసూయ. దీనిబట్టి చూస్తే వేణు స్వామి చెప్పింది నిజమేననిపిస్తోంది అంటున్నారు నెటిజన్లు. ఆమె రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అంటున్నారు.

ఇక అల్లు అర్జున్ కు రో పదేళ్ళు తిరుగుండదు అని చెబుతున్నారు వేణుస్వామి. పుష్ప-2 కూడా తిరుగులేని హిట్ అవుతుందని జోస్యం చెప్పారు. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక సంచలనం అవుతుందని అంటున్నారు. ఇలాగే మరో పదేళ్ళు బన్నీబాబు ఇండస్ట్రీని ఏలుతాడని చెబుతున్నారు. వేణుస్వామి చెప్పినదానికి తెగ ఖుషీ అయిపోతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇప్పటికే పుష్ఫ-2 పాజిటివ్ బజ్ సంపాదించుకుంది. టీజర్, పోస్టర్లు విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఇప్పుడు సినిమా కూడా హిట్ అవుతుందని చెప్పేసరికి ఆనందంలో మునిగి తేలుతున్నారు అభిమానులు.

Tags:    

Similar News