Anasuya Political Entry: రాజకీయాల్లోకి అనసూయ.. రజాకార్ సినిమా తర్వాత!

By :  Bharath
Update: 2023-10-10 16:46 GMT

సినిమా ఇండస్ట్రీకి.. రాజకీయాలకున్న సంబంధం ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ అప్పటి నుంచి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరకు రాజకీయ రంగ ప్రవేశంచేసిన వారే. స్టార్ హీరోలే కాకుండా.. హీరోయిన్లు, చిన్న చిన్న యాక్టర్లు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లున్నారు. సినిమాల్లో కాస్త పాపులర్ అయితే చాలు.. వాళ్లను అందరూ అడిగే ప్రశ్న ‘పొలిటికల్ ఎంట్రీ’ ఎప్పుడని. ఇప్పుడదే ప్రశ్న హాట్ బ్యూటీ, యాంకర్ అనసూయకు ఎదురయింది. అంతేకాకుండా తాను పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు వార్తలు కూడా వచ్చాయి. దాంతో తాజాగా ఈ రూమర్స్ పై అనసూయ క్లారిటీ ఇచ్చింది.

యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనసూయ.. రంగస్థలం, పుష్ప సినిమాల్లో తన యాక్టింగ్ తో మెప్పించింది. ప్రస్తుతం ఆమె రజాకార్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పాట తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న అనసూయకు ఈ ప్రశ్న ఎదురైంది. రజాకార్ సినిమా రాజకీయ నేపథ్యంతో తెరకెక్కడం, నిర్మాత బీజేపీ నాయకుడు కావడంతో అనసూయ పొలిటికల్ ఎంట్రీపై చర్చ బయటకు వచ్చింది. ఆ సినిమా ఈవెంట్ లో మీడియా కూడా ఆమెను అదే ప్రశ్న అడిగింది. దానికి సమాదానం ఇచ్చిన అనసూయ తనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని, పాలిటిక్స్ తనవల్ల కాదని చెప్పుకొచ్చింది. నిర్మాత బీజేపీ నాయకుడు కదా? మీ మధ్య రాజకీయాల గురించి చర్చలు జరిగాయా? అని అడగగా.. అసలు వాళ్ల మధ్య ఎప్పుడూ అటువంటి టాపిక్ రాలేదని క్లారిటీ ఇచ్చింది.

Tags:    

Similar News