పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్...పెళ్లి కూతురు ఆమె?

By :  Vinitha
Update: 2024-02-22 11:47 GMT

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యాంకర్ ప్రదీప్ త్వరలో పెండ్లి పీటలెక్కబోతున్నాడు. బుల్లితెర యాంకర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు టాప్. బుల్లితెరపై తన దైన కామెడీ టైమింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అతని కామెడీ టైమింగ్ కి, జోకులకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అటు ప్రదీప్ కి అమ్మాయిల్లో కూడా ఫాలోయింగ్ చాలానే ఉంది. యాంకర్లలో తనకంటూ ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేసుకొని క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేగాక 30 రోజుట్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగాను ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికే ముప్పై పదుల్లో అడుగు పెట్టిన ప్రదీప్ పెండ్లిపై చాలా రూమర్లు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. కొంతకాలంగా యాంకర్‌ ప్రదీప్‌ పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతకముందు పొలిటికల్‌ లీడర్‌ కూతురితోనే అతని వివాహం అని రూమర్లు వినిపించిన సంగతి తెలిసిందే. గతంలో కూడా అతని పెళ్లిపై రకారకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త‌లు తాజాగా మ‌ళ్లి వైర‌ల్ అవుతున్నాయి. త‌న పెళ్లిపై ప్రదీప్ క్లారిటీ ఇచ్చిన‌ట్లు సమాచారం. ప్రదీప్ తన చిన్ననాటి ఫ్రెండ్ ను ప్రేమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక త్వరలో ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ప్రదీప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ప్రదీప్ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News