Animal Collections: బాక్సాఫీస్ రికార్డుల మోత.. రణ్‌బీర్ కెరీర్‌లో..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, రణ్ బీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా యానిమల్. వరల్డ్ వైడ్ గా నిన్న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. దీంతో మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కలెక్షన్ల దుమ్ములేపిన యానిమల్.. ఫస్ట్ డే ఏకంగా వంద కోట్లు వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇండియాలోనే దాదాపు రూ.70 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక మార్కెట్ వారీగా చూస్తే.. హిందీలో రూ.50 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, కర్నాటక, తమిళ్, కేరళ కలిపి మొత్తంగా రూ.60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.
రెమ్యునరేషన్లన్నీ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ టాక్ రావడంతో రూ.200 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర యానిమల్ హవా చూస్తుంటే.. రూ.210 కోట్ల బ్రేక్ ఈవెన్ ను ఈ వీకెండ్ లో దాటేసి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది. అంతేకాదు.. ఈ సినిమా రణ్బీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోనుంది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది యానిమల్.