దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీస్ ను సర్ ప్రైజ్ చేసిన సినిమా యానిమల్. సినిమాగా కంటే కలెక్షన్స్ తోనే ఎక్కువ ఆశ్చర్యపరిచిందీ సినిమా. మెజారిటీ ఆడియన్స్ కు అస్సలు నచ్చలేదు అనే చెప్పారు. బట్ నచ్చినవాళ్లు మాత్రం రిపీటెడ్ గా చూశారీ యానిమల్ ను. మనిషిలోని యానిమల్ ఇన్ స్టింక్ట్ ను తనదైన కోణంలో ప్రజెంట్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. సెకండ్ హాఫ్ వీక్ గా ఉంది. బోర్ అనిపించింది అనే రివ్యూస్ చాలా ఉన్నాయి. ఇక నిడివి పరంగానూ మూడున్నర గంటల వరకూ ఉండటం కొందరిని ఇబ్బంది పెట్టింది. బట్ మేకింగ్ పరంగా మాత్రం సందీప్ కల్ట్ మూవీ అన్న రేంజ్ లో రూపొందించాడు. సినిమాకు ఎంత అప్లాజ్ వచ్చిందో అంతే విమర్శలూ వచ్చాయి. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఒక సినిమా సక్సెస్ ను ఇప్పుడు కంటెంట్ కంటే కలెక్షన్స్ డిసైడ్ చేస్తున్నాయి కాబట్టి.. యానిమల్ బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే చెప్పాలి. డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 820 కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించింది. మరి ఇన్ని కలెక్షన్స్ అంటే ఖచ్చితంగా రెమ్యూనరేషన్ లెక్కలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కదా.. అలా చూస్తే ఈ మూవీ దర్శకుడికే అందరికంటే ఎక్కువ పారితోషికం అందింది.
సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి రచయిత దర్శకుడుగానే కాదు.. నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నాడు. అందువల్ల అతని రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో కూడా వాటాలు తీసుకున్నాడు. ఓవరాల్ గా దీన్ని రెమ్యూనరేషన్ గా చూస్తే సందీప్ కు ఏకంగా 200 కోట్లకు పైనే అందింది.
ఇక హీరోగా రణ్ బీర్ కపూర్ ఈ మూవీకోసం ప్రాణం పెట్టినట్టు అర్థమైంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అన్ని షేడ్స్ లోనూ అదగరొట్టాడు. బట్ మార్కెట్ పరంగా కాస్త లో లో ఉన్నాడు రణ్ బీర్. అందుకే అతనికి రెమ్యూనరేషన్ గా 70 కోట్లు ఇచ్చారు. హీరోయిన్ రష్మిక మందన్నా కు 4 కోట్ల రెమ్యూనరేషన్ అందింది. బట్ తనకు తెలుగులో ఇంత పెద్ద పారితోషికం లేకపోవడం విశేషం.
విలన్ గా సినిమా చివర్లోనే కనిపించినా.. బలమైన ఇంపాక్ట్ చూపించి సినిమా రేంజ్ నే మార్చిన బాబీ డియోల్ కు కూడా 4 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడం విశేషం. బట్ అతను తన రెమ్యూనరేషన్ కు న్యాయం చేశాడనే చెప్పాలి. ఇక రణ్ బీర్ కు ఫాదర్ గా నటించిన అనిల్ కపూర్ కు 2 కోట్లు ఇచ్చాడు.
విశేషం ఏంటంటే.. ఈ మూవీకే హైలెట్ గా నిలిచి.. నయా నేషనల్ క్రష్ అనిపించుకుంటోన్న తృప్తి దిమ్రికి కేవలం 40 లక్షలు మాత్రమే పారితోషికం ఇచ్చారు. నిజానికి ఈ మూవీ హీరోయిన్ కాకపోయినా తన వల్లే ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది. రష్మిక పాత్ర కంటే తృప్తి రోల్ కే ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఇప్పటి వరకూ తనకంటూ ఏ రేంజ్ లేదు కాబట్టే ఇంత తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారు. బట్ యానిమల్ తన కెరీర్ కు బిగ్గెస్ట్ ఎసెట్ అయ్యింది. ఈ క్రేజ్ తో ఫ్యూచర్ లో తనూ భారీ రెమ్యూనరేషన్ తీసుకునే భామల సరసన చేరుతుందనుకోవచ్చు. మొత్తంగా ఈ రెమ్యూనరేషన్స్ అన్నీ చూసినా.. యానిమల్ భారీ లాభాలే అందుకుంటోందని తేలిపోయింది.