Singer Chinmayi : అన్నపూర్ణమ్మ అలా అనడం తప్పు.. సింగర్ చిన్మయి ఫైర్
చిన్మయి శ్రీపాద..టాలీవుడ్ టాప్ సింగరన్న విషయం అందరికీ తెలిసిందే. సింగర్‌గా ఎంతో మందిని తన గాత్రంతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఆమె మీటూ ఉద్యమం గురించి ఎప్పటికప్పుడు షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. నిర్మొహమాటం లేకుండా తన మనసులోని మాటలను చిన్మయి చెబుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి సంబంధించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే వారికి చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది. తాజాగా సింగర్ చిన్మయి మరోసారి సీరియస్ అయ్యారు. అదికూడా తనకు ఎంతో ఇష్టమైన సీనియర్ నటిపై ఫైర్ అవుతూ సెటైరిటికల్‌గా మట్లాడారు. ఇంతకీ ఆ సీనియర్ నటి ఎవరో? చిన్మయి అలా ఎందుకు సీరియస్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మపై సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్ చేసింది. అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్ల గురించి, వారి స్వాతంత్ర్యం గురించి మాట్లాడింది. ఆ రోజుల్లో అర్ధరాత్రి స్వతంత్య్రం అనగానే ఆడవారు బయటకు వచ్చేవాళ్లా? అసలు ఆడడానికి స్వాతంత్య్రం ఎందుకు కావాలి? 12 గంటల తర్వాత వారికి బయట ఏం పని? అంటూ అన్నపూర్ణమ్మ ప్రశ్నించారు. అంతేకాకుండా ఇప్పుడంతా ఆడవారి ఎక్స్‌పోజింగ్ ఎక్కువైపోయిందన్నారు. ఆడవారిని ఎవరూ ఏమీ అనకూడదని అనుకున్నానని, కానీ అలా అనేటట్లుగా ఆడవారు రెడీ అవుతున్నారని అన్నపూర్ణమ్మ కస్సుమన్నారు. ఎప్పుడూ ఎదుటి వారిదే తప్పు కాదని, ఆడవాళ్లది కూడా తప్పు ఉంటుందని చెప్పారు.
ఆడవారిపై అన్నపూర్ణమ్మ చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ కామెంట్స్ పై సింగర్ చిన్మయి సీరియస్ అయ్యింది. చిన్మయి మాట్లాడుతూ.. అన్నపూర్ణమ్మ చెప్పిన రూల్ ప్రకారంగా అర్ధరాత్రి లేడీ డాక్టర్లు ఉండకూడదన్నారు. మహిళలు అర్ధరాత్రి పిల్లల్ని ప్రసవించకూడదని అన్నారు. పల్లెటూర్లలో చాలా మంది మహిళలు బాత్ రూమ్ లేక బయటకు వెళ్తున్నారన్నారు. అలాంటి సమయం చూసి ఆడవారిపై అఘాయిత్యానికి పాల్పడుదామని చాలా మంది ఎదురుచూసేవాళ్లు ఉన్నారన్నారు.
అమ్మాయిల డ్రెస్సింగ్ వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నపూర్ణమ్మ లాంటివాళ్లు అనుకోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటివాళ్లు ఉన్న భారతదేశంలో ఆడపిల్లలుగా పుట్టడం మనం చేసుకున్న కర్మ అని అంటూ చిన్మయి సెటైరిటికల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం చిన్మయి పోస్టు చేసిన ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసినవారంతా అన్నపూర్ణమ్మను తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో అన్నపూర్ణమ్మ చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. మొత్తానికి ఆడవాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఆడవాళ్లే పోట్లాడుకోవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.