అల్లు అర్జున్ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..సౌత్లోనే ఫస్ట్ హీరో

By :  Vinitha
Update: 2024-03-21 07:20 GMT

పుష్ప‌ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ అల్లుఅర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తన నటనకు గానూ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్నాడు బన్నీ. పుష్పతో సౌత్ లోనే కాకుండా అటు నార్త్ లోనూ బన్నీ క్రేజ్ పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అయితే ఇటు సోషల్ మీడియాలోనూ బన్నీ యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలతో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. బన్నీ ఇన్ స్టాలో 25 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. దీంతో సౌత్ హీరోల్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా రికార్డులకెక్కాడు.

దీనిపై స్పందించిన బన్నీ థ్యాంక్యూ..25 మిలియన్స్ అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు. దీంతో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఐకాన్ స్టార్ తర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ (21.3 మిలియ‌న్లు), రామ్ చ‌ర‌ణ్ (20.8 మిలియ‌న్లు), దుల్క‌ర్ స‌ల్మాన్ (14.1 మిలియ‌న్లు), య‌శ్ (13.5 మిలియ‌న్లు), మ‌హేశ్ బాబు (13.4 మిలియ‌న్లు), ప్ర‌భాస్ (11.7 మిలియ‌న్లు), ద‌ళ‌ప‌తి విజ‌య్ (10.8 మిలియ‌న్లు) లకు అత్యధికంగా సోషల్ మీడియాలో ఫాలోవ‌ర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప‌-2' మూవీలో న‌టిస్తున్నాడు. 'పుష్ప‌: ది రైజ్‌' కు సీక్వెల్‌గా ఈ చిత్రం వ‌స్తోంది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ త్రివిక్ర‌మ్‌, సందీప్ రెడ్డి వంగాల‌తో బన్నీ సినిమాలు చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. 

Tags:    

Similar News