Kannappa Movie : కన్నప్ప మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో తెలుసా?

Byline :  Vinitha
Update: 2024-02-29 04:51 GMT

కన్నప్ప మూవీలో స్టార్స్ వెల్లువ కొనసాగుతోంది. మంచు ఫ్యామిలీ ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. హీరో మంచు విష్ణు మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. అంతేగాక ఈ సినిమాలో మోహన్ బాబు కూడా కీ రోల్ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ మూవీ..మంచు ఫ్యామిలీలోనే బిగ్గెస్ట్ సినిమాగా వస్తోంది. సినిమాకి హైప్ తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఇండియా వైడ్ గా స్టార్ క్యాస్ట్ ను దింపుతున్నారు మేకర్స్.




 


ఇప్పటికే కన్నప్పలో గెస్ట్ రోల్ లో ప్రభాస్ శివుడిగా కన్పించనున్నారు. అయితే ఇందులో పార్వతిగా నయనతార కన్పించనున్నట్లు మధుబాల చెప్పారు. ఇక కన్నడ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో స్టార్ హీరో మోహన్ లాల్ ఈ మూవీలో చేయనున్నారు. అయితే తాజాగా మరో స్టార్ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. అవును కన్నప్ప సినిమాలో ఓ కీ రోల్ కోసం మంచు విష్ణు బాలయ్యని కలిసినట్టు సమాచారం. దానికి బాలకృష్ణ కూడా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


 



అయితే గతంలో మంచు ఫ్యామిలీ కోసం ఊ కొడతావా ఊలిక్కి పడతావా మూవీలో బాలయ్య గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్యతో ఉన్న ఫ్రెండ్ షిప్ తో మూవీలో చేయమని అడగగా..ఆయన కూడా వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ పై నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా మిగిలారా..అన్ని ఇండస్ట్రీల నుండి దాదాపు అందరు స్టార్స్ వచ్చేశారు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ స్టార్స్ రాకతో మూవీపై ఫ్యాన్స్ కు మరిన్ని అంచనాలు పెరగుతున్నాయి. ఇక కన్నప్ప మూవీ ఇప్పటికే దాదాపు షూటింగ్ పూరైంది. మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏ రేంజ్ లో ఆడియన్స్ కు చెరువవుతుందో చూడాలి.




Tags:    

Similar News