అందాల భామ అనుపమ పరమేశ్వరన్..గ్లామర్ డోస్ పెంచేసింది. తన అందంతో ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ శారీలో ఫోజులిచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కర్లీ బ్యూటీ అనుపమ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్యూట్ ఫోటోస్‌తో కుర్రాళ్ల మనసును అనుపమ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మలయాళ ‘ప్రేమమ్’ మూవీతో పాపులర్ అయిన అనుపమకు తెలుగులో కూడా వరుస సినిమా అవకాశలొచ్చాయి. తెలుగులో మొదటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఈ మధ్యనే హీరో నిఖిల్‌తో కార్తికేయ 2, 18 పేజెస్ చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు హీరో సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్వ్కేర్ మూవీతో రచ్చ చేయడానికి వచ్చేస్తోంది.