Virat- Anushka: ప్రెగ్నెన్సీపై.. ఇన్స్టా స్టోరీతో క్లారిటీ

Byline :  Bharath
Update: 2023-10-04 11:03 GMT

ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, స్పోర్ట్స్ లో అయినా.. క్యూట్ కపుల్ ఏదంటే టక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ. దేశ వ్యాప్తంగా ఈ లవ్ బర్డ్స్ ను చాలామంది ఇష్టపడుతుంటారు. ఈ జంట 2017లో వివాహబంధంతో ఒక్కటి కాగా.. 2021లో వీరికి వామిక జన్మించింది. తాజాగా వీళ్లిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విరాట్, అనుష్క మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఓ ఇంగ్లిష్ చానెల్ రాసుకొచ్చింది. అది నిజమే అనుకున్న విరాట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ వార్త దేశమంతా పాకింది. ఈ వార్తలపై ఇన్ స్టాగ్రామ్ ద్వారా అనుష్క శర్మ క్లారిటీ ఇచ్చింది. తను పెట్టిన కొటేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.




 


అనుష్క, విరాట్ ముంబైలోని ఓ గైనకాలజిస్ట్ ను కలిశారు. ఆ హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు మీడియా ఫొటోలు, వీడియోలు తీసింది. ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీయొద్దంటూ అనుష్క మీడియాను అభ్యర్థించింది. ఇక అప్పటి నుంచి అనుష్క బయటికి రాకపోవడం, మీడియాకు దూరంగా ఉండటంతో.. ప్రెగ్నెన్సీ వార్తలపై బలం చేకూరింది. దీనిపై క్లారిటీ ఇస్తూ అనుష్క పోస్ట్ పెట్టింది. ‘అభిప్రాయాలు వ్యక్తిగతంగా వస్తాయి. వాటిని మీరు అర్థం చేసుకోవాలి. వాటిపై జడ్జిమెంట్ ఎలా ఇస్తారు. అది మీరు అర్థం చేసుకోవాలి’ అని చెప్పుకొచ్చింది. అయితే, నెదర్లాండ్స్ తో వార్మప్ మ్యాచ్ కు ముందు విరాట్ అత్యవసర లీవ్ తీసుకుని ముంబై వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ వార్తపై నిజం ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.




 




Tags:    

Similar News