చై-చందూ మొండేటి సినిమాకు ఎఆర్ రహమాన్ మ్యూజిక్?

Update: 2023-07-10 07:31 GMT

వరుస ఫ్లాప్ లతో కష్టాలు మూటగట్టుకుంటున్న అక్కినేని వారసుడి నెక్స్ట్ సినిమాకు గట్టి ప్లాన్స్ వేస్తున్నారుట. చై తరువాతి సినిమా కార్తికేయ-2 తీసిన చందు మొండేటి డైరెక్షన్ లో రాబోంది ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 60 కోట్లు ఖర్చు పెట్టి తీయబోతోంది.

నాగచైతన్య-చందు మొడేటా సినిమా గురించి బోలెడు వార్తలు బయటకు వస్తున్నాయి. తర్వలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని చెబుతున్నారు. కార్తికేయ-2తో ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకున్న చందు ఈ సినిమాను అంతకు మించి హిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. శ్రీకాకుళం నుంచి పాకిస్తాన్ వరకు తీర ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో దేశభక్తి సినిమాగా ఉంటుందని టాక్. అందుకే దీనికి ఎ ఆర్ రహమాన్ చేత మ్యూజిక్ డైరెక్షన్ చేయించాలని కూడా ఆలోచిస్తున్నారని సమాచారం. దేశ భక్తి మ్యూజిక్ ఇవ్వడంలో రహమాన్ ను మించిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే ఈ డెసిషన్ అంటున్నారు. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే అనిరుధ్ రవిచంద్రన్ చేత చేయిస్తారని చెబుతున్నారు.

నాగచైతన్య ఈ సినిమాలో ఫిషర్ మ్యాన్ గా కనిపిస్తారని సమాచారం. నాగచైతన్య కెరీరియర్ లోని ఇది భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని చెబుతున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా తీయాలని ప్లాన్స్ వేస్తున్నారుట. బయటకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెట్ రాకపోయినా ఇండస్ట్రీలో చై సినిమా గురించి చర్చ ఎక్కువగానే నడుస్తోందని సమాచారం. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథని కంప్లీట్ మాస్ టచ్ తో చెప్పబోతున్నారని... పీరియాడిక్ జోనర్ లో ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం క్యాస్టింగ్ ఫైనల్ చేసే పని లో చిత్ర యూనిట్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో పూజా కార్యక్రమాలతో మూవీని స్టార్ట్ చేసే వెంటనే షూటింగ్ కి కూడా వెళ్లనున్నారని వినికిడి.




Tags:    

Similar News