సౌతిండియా టాలెంటెడ్ నటుడు అర్జున్ సర్జా ఇంట్లో త్వరలో పెళ్లి బాజా మోగనుంది. ఆయన కూతురు, నటి ఐశ్వర్వ పెళ్లి రంగం సిద్ధమవుతోంది. సహ నటుడు ఉమాపతి రామయ్యను ఆమె పెళ్లిచేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామయ్య. ప్రముఖ తమిళ నటుడు తంబి రామయ్య కొడుకైన ఉమాపతి(33), ఐశ్వర్య(31)లు కొన్నాళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఐశ్వర్య అందానికి అందం, నటనకు నటన ఉన్నా ఆమె సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. 2013లో ‘పట్టతు యానై’ మూవీతో తెరంగేట్రం చేసిన ఆమె ‘ప్రేమ బరాహ’ చిత్రంతో కాస్త పేరు తెచ్చుకుంది. ఉమాపతి రామయ్య 2017లో ‘అడగపట్టత్తు మగజనంగళయ్’ అనే తమిళ మూవీతో సినీరంగ ప్రవేశం చేశాడు. మణియార్ కుడుంబం, తిరుమనమ్, తన్నేవాడి వంటి చిత్రాల్లోనూ నటించినా హిట్లయితే పడలేదు. అర్జున్.. ఐశ్వర్య, కుర్ర మాస్ హీరో విశ్వక్ సేన్ హీరోహీరోయిన్లు ఓ మూవీని ప్రారంభించడం, వివాదాలతో ఆ ప్రాజెక్టు పట్టాలు తప్పడం తెలిసిందే.