రాజ్ తరుణ్ హీరోయిన్ ఇంట్లో ఏం జరుగుతోంది..?

Update: 2023-07-09 16:48 GMT

అర్థనా బిను.. రాజ్ తరుణ్ సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతో తెలుగుప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకున్నా తమిళ, మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. తన తండ్రి వేధిస్తున్నాడంటూ ఇంతకుముందే ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోపై స్పందించిన తండ్రి విజయ్ కుమార్ తాను దొంగను కాదని.. తన కూతుళ్ల కోసమే వెళ్లానని చెప్పాడు. అంతేకాకుండా పలు విషయాలు చెప్పాడు. వాటిపై అర్థనా బిను స్పందించింది.

తన తండ్రి చెబుతున్న విషయాలన్నీ అసత్యాలే అని అర్థనా చెబుతోంది. దీనిపై ఓ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. నా సోదరి గేట్ తీస్తేనే మా నాన్న లోపలికి వచ్చాడన్నది అబద్దం. కొన్ని రోజులు క్రితం నేను షేర్ చేసిన వీడియో గమనిస్తే గేట్కి లోపల నుంచి తాళం వేసి ఉంటుంది. మా ఇంట్లో నేను, అమ్మ, చెల్లి, నానమ్మ ఉంటున్నాం. రేపు ఇతడిని చూసి ఇంకెవరైనా గోడ దూకి వస్తే మా పరిస్థితి ఏంటి?’’ అని ప్రశ్నించింది.

అలాగే తన భార్యతో అధికారికంగా విడాకులు రాలేదు.. ఆమె అకౌంట్లో 40వేలు వేశానంటూ తన తండ్రి చేసిన ఆరోపణలు కూడా అవాస్తవమని అర్థన తెలిపింది. ‘‘ మా తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు వచ్చాయి. ఆ సాక్ష్యాన్ని కూడా పోస్ట్ చేస్తున్నా. నా తండ్రి మా అమ్మకు 10 లక్షల రూపాయలు, బంగారం బాకీ ఉన్నాడు. అలాగే నెలవారీగా ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ బకాయికి కూడా ఇవ్వడం లేదు. ఆయన చెప్పిన 40వేలు మాకు చెల్లించాల్సిన డబ్బు యొక్క వాయిదాలు మాత్రమే’’ అని వివరించింది.

ఇటీవల జరిగిన పరిణామాలపై కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే అప్పటికే వేసిన కేసులే ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్లీ కొత్త ఫిర్యాదులు వద్దని అమ్మ చెప్పడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పింది. అయితే తల్లిదండ్రుల విడాకులు, లావాదేవీల వివరాలు మొత్తం ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది.

Tags:    

Similar News