ప్రభాస్ జాతకంలో దోషం.. తులా రాశి ఎఫెక్ట్.. సినిమాలు ఇక కష్టమే..!

Update: 2023-06-16 17:20 GMT

టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు వేణు స్వామి. ఆయన చెప్పినవి చెప్పినట్లు చాలా వరకు జరిగాయి. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్.. మరోసారి దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి.. ప్రభాస్ జాతకం చెప్తూ, ఆదిపురుష్ సినిమా అంత పెద్ద హిట్ కొట్టదు అని అన్నారు. ఇప్పుడు అదే నిజం అయింది. మిక్స్డ్ టాక్ తో ఆదిపురుష్.. ట్రోల్స్ కు గురవుతుంది.

‘ప్రభాస్ ది తులా రాశి. జాతకంలో దోషం ఉంది. ఆ ఎఫెక్ట్ తో ఎన్ని సినిమాలు తీసినా పెద్ద హిట్ లు రావు. కొంతకాలం ఇలానే ఉంటుంది. మళ్లీ చిన్న సినిమాలు చేసుకుంటేనే తిరిగి సక్సెస్ దక్కుతుంది’ అంటూ జాతకం చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పిందే జరిగింది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిపై ఫైర్ అవుతున్నారు. ‘నువ్వు చెప్పావు కాబట్టే సినిమా ఫెయిల్ అయింది’ అంటూ తిడుతున్నారు.


Tags:    

Similar News