బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా హిట్ తో దేశ వ్యాప్తంగా డైరెక్టర్ అట్లీ పేరు మారుమోగుతుంది. అట్లీ గురించి తెలియని వాళ్లు నెట్ లో అతని గురించి తెగ వెతుకుతున్నారు. అట్లీ ఎవరు? ఏ సినిమాలు తీశాడు? డెబ్యూ డైరెక్టరా? అసలు ఎవరికీ తెలియని డైరెక్టర్ షారుఖ్ తో సినిమా తీసి ఇంత పెద్ద హిట్ ఎలా కొట్టాడంటూ అతని గురించి తెలుసుకునే ప్రయత్నంచేస్తున్నారు. ఇప్పటివరకు అట్లీ తీసిన ఐదు సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. ఈ క్రమంలో అట్లీకి హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ ఈ విషయాన్ని పంచుకున్నాడు.
ప్రస్తుతం బాలీవుడ్ లో వరుణ్ ధావన్, టాలీవుడ్ లో అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ ఓకే చెప్పాడు. ఈ సినిమాల తర్వాత తర నెక్స్ట్ సినిమా స్పానిష్ లో ఉండబోతుంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. అంతేకాకుండా జవాన్ ను ఆస్కార్ కు తీసుకుపోతున్నట్లు చెప్పుకొచ్చాడు. తమిళ సినిమా తేరీకి రీమేక్ గా వరుణ్ ధావన్ సినిమా తెరకెక్కబోతుంది.