అవతార్ 3 విడుదల తేదీ మరో ఏడాదికి వాయిదా.?

Update: 2023-06-14 05:21 GMT

ప్రపంచ సినిమా చరిత్రలోనే అతిపెద్ద మూవీ ఫ్రాంఛైజీ అవతార్. అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3 సినిమాల్లో రెండు ఈ ఫ్రాంఛైజీకి చెందినవే. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీ నుంచి రెండు సినిమాలు రాగా.. మరో మూడు రానున్నాయి. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. అవతార్ 3 రిలీజ్ తేదీ వాయిదా పడింది. అనుకున్న సమయాని కంటే ఏడాది ఆలస్యం కానుంది. గతేడాది `అవతార్‌ 3, 4, 5` పార్ట్ ల రిలీజ్‌ డేట్ లు ప్రకటించింది నిర్మాణ సంస్థ. మూడో భాగం డిసెంబర్‌ 20, 2024న రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు నాల్గో భాగం 2026 డిసెంబర్‌ 18, ఐదో భాగం 2028 డిసెంబర్‌ 22న అనుకున్నారు. ప్రతి రెండేళ్లకి ఒకసారి ఒక్కో పార్ట్ ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని జేమ్స్ కామెరాన్‌, 20వ సెంచరీ ఫాక్స్ భావించారు. అయితే తాజాగా అవతార్ 3 రిలీజ్ తేదీ వాయిదా పడినట్లు వెరైటీ మ్యాగజైన్ వెల్లడించింది. డిస్నీలో భారీ మార్పులు చోటు చేసుకుంటుండటంతో ఆ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలు ఆలస్యమవుతున్నాయని వెల్లడించింది. రిలీజ్‌ డేట్స్ లో భారీగా మార్పులుంటాయని చెప్పింది.




`అవతార్‌ 3`ని 2025లో విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. 2025 డిసెంబర్‌ 19న రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలిపింది. మరోవైపు నాల్గో భాగాన్ని 2029 డిసెంబర్‌ 21, ఐదో భాగాన్ని 2031 డిసెంబర్‌ 19న విడుదల చేయబోతున్నారు. దీంతో మిగిలిన మూడు పార్ట్ లు ఐదేళ్ల డిలేతో రాబోతున్నాయి. అయితే రెండో సినిమాపై వచ్చిన విమర్శల కారణంగానే, మరింత వర్క్ చేయాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతో రిలీజ్‌ డేట్‌లు మార్చినట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం `అవతార్‌` ప్రియులను తీవ్ర నిరాశకు గురి చేస్తుందని చెప్పొచ్చు. కాగా.. 2009లో వచ్చిన అవతార్ మూవీ ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయగా.. గతేడాది రిలీజైన అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూడో స్థానంలో నిలిచింది. 




 


Tags:    

Similar News