Ayodhya Ram mandir: అయోధ్య రామమందిర ఆహ్వాన పత్రికను చూశారా..? ప్రత్యేకతలివే..!

By :  Bharath
Update: 2024-01-11 15:16 GMT

చరిత్రాత్మక ఘట్టంగా నిలవనున్న అయోధ్య రమ మందిర ప్రారంభోత్సవ వేడుకకు సర్వం సిద్ధం అయింది. యావత్ దేశం ఈ వేడుక కోసం వేచి చూస్తుంది. ఈ నేపథ్యంలో రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వారు దేశ వ్యాప్తంగా ఉన్న విశిష్ట అతిథులకు ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. మొత్తం ఆరు వేల మందికి ఆహ్వానం అందించారు. కాగా ఆహ్వానం అందుకున్న వారిలో టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, ప్రభాస్ లు కూడా ఉన్నారు. ప్రత్యేక ఘట్టానికి ఆహ్వాన పత్రికలు అందడంతో.. చిరంజీవి, ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆహ్వాన పత్రికలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే..!

పత్రికలో ఉన్న అక్షరాలను దేవనాగరి లిపిలో లిఖించారు. పేజీ తెరవగానే బాల రాముని రూపం కనిపిస్తుంది. ఆ తర్వాత పేజీలో వేడుకకు హాజరయ్యే ప్రముఖలు పేర్లను అచ్చువేయించారు. అందులో ప్రధానీ నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్య నాధ్, ఆఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్ట్ అధ్యక్షడు.. మొదలగు వారి పేర్లు ఇందులో ఉన్నాయి. జనవరి 22న ఉదయం పూజ, మధ్యాహ్నం విగ్రహ ప్రాణ ప్రతిష్ట నిర్వహించనున్నట్లు ఆహ్వాన పత్రికలో ఉన్నాయి. ఈ పత్రికతో పాటు.. మరో బుక్ లెట్ ను అతిథులను ఇస్తున్నారు. అందులో రామమందిర నిర్మాణానికి ఎవరెవరు కృషి, పోరాటం చేశారో వారి వివరాలను అందులో ఇచ్చారు.


Tags:    

Similar News