మ్యూజియంలో ‘బాహుబలి’ స్టాట్యూ.. నిర్మాత సీరియస్

Update: 2023-09-26 05:44 GMT

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్(Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బాహుబలి’(Bahubali). రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ క్రేజ్ ని గుర్తించిన లండన్ లోని ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ (Madame Tussauds) మ్యూజియం.. గతంలోనే అక్కడ బాహుబలి అవతార్ లో ప్రభాస్ మైనపు బొమ్మని ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. దీంతో ప్రభాస్ కి మరింత గుర్తింపు వచ్చిందని అభిమానులు, బాహుబలికి కూడా మంచి రీచ్ వచ్చిందని చిత్రయూనిట్ సంతోషించారు.

ఇప్పుడు తాజాగా మరో ప్రభాస్ మైనపు బొమ్మ(Wax Statue) ఆడియన్స్ ముందుకు వచ్చింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్ నగరంలోని ఓ మైనపు మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి గెటప్ లో ఉన్న ప్రభాస్ స్టాట్యూని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ మైనపు బొమ్మని చూసిన నెటిజెన్స్, ప్రభాస్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ఆ మైనపు విగ్రహం చూడడానికి అసలు ప్రభాస్ లాగానే లేదు. బాహుబలి గెటప్ లో ఎవరిదో మైనపు విగ్రహం పెట్టారని, ఆ బొమ్మని తీసేయాలని, ప్రభాస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయొద్దని అభిమానులు, నెటిజన్లు ఆ మైనపు బొమ్మపై ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ బాహుబలి మైనపు బొమ్మ కాస్త వివాదంలో నిలిచింది.

మరోవైపు ఈ మైనపు బొమ్మ ఏర్పాటుపై బాహుబలి నిర్మాత ఒకరు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ .. ఈ ఫోటోలను షేర్ చేయగా.. సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ దానిని రీ షేర్ చేసి.. ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకొని చేసిన వర్క్ కాదు. ఎలాంటి సమాచారం, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ బొమ్మని చేశారు. ఈ బొమ్మని తొలగించేలా వెంటనే చర్యలు తీసుకుంటాం అని సీరియస్ పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి బెంగుళూరులోని ఆ మ్యూజియం వాళ్ళు ఈ ప్రభాస్ మైనపు బొమ్మని తీసేస్తారా లేక నిర్మాత శోభు యార్లగడ్డ వీరిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారా చూడాలి.

Tags:    

Similar News