ఆనంద్, విరాజ్‌లలో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. వైష్ణవి ఏం చెప్పిందంటే..?
ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజై టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన మూవీ బేబీ. తమ కావాల్సిందీ స్టార్ క్యాస్ట్ కాదని.. స్టోరీలో కంటెంట్ ఉంటే చాలని ప్రేక్షకులు బేబీ సినిమాతో మరోసారి నిరూపించారు. ఆనంద్ దేవర కొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన ఈ మూవీ జులై 14న థియేటర్స్లోకి వచ్చింది. ఫస్ట్ డే నుంచే ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. 14కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 80కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఓటీటీలోనూ ఈ మూవీ రికార్డులు సృష్టించింది.
ఈ మూవీలో హీరోయిన్ వైష్ణవ్ నటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో ఆహా వాట్సాప్ బేబీ పేరుతో వైష్ణవి చైతన్యతో ఓ వీడియోను చేసింది. ఈ వీడియోలో పలు ప్రశ్నలకు వైష్ణవి క్రేజీ ఆన్సర్స్ ఇచ్చింది. ఆనంద్, విరాజ్‌లలో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరిని చేసుకుంటావ్? అని అడగ్గా..ఇద్దరినీ చేసుకోను అని వైష్ణవి సమాధానం ఇచ్చింది. ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ నచ్చుతుందని చెప్పింది.
బేబీలోని వైష్ణవి పాత్ర నచ్చిందా అని అడగ్గా.. ఎంతో నచ్చింది అంటూ నవ్వుతూ చెప్పింది. అంతేకాకుండా బేబీ సినిమాలో వైష్ణవి చేసింది కరెక్టేనా అని ప్రశ్నించగా.. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అంటూ మనకి మనం పరిమితులు పెట్టుకోలేం కదా.. ఆ పాత్ర తీరును బట్టి ఆ సమయంలో ఏం అనిపిస్తే వైష్ణవి అది చేసింది అని ఆన్సర్ ఇచ్చింది. ఈ సినిమాలో వైష్ణవి తన ఎక్స్ప్రెషన్స్తో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది.