బేబి సినిమాలో ఆ ముగ్గురి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!

Update: 2023-07-23 11:53 GMT


 



తెలుగురాష్ట్రాల్లో ప్రస్తుతం భాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న చిత్రం బేబి. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రం యువతను తెగ ఆకట్టుకుంటోంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు తమ నటనతో ఇరగదీశారు. జూలై 14న చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌ను సొంతం చేసుకుంది. స్కూల్ డే‌ స్‌‌లో ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ.. కాలేజీకి వెళ్లాక ఎలా మారుతుందనే సన్నివేశాలతో సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటనకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.




 బేబి చిత్రానికి రెస్పాన్స్‌తో పాటు కలెక్షన్స్ కూడా కుమ్మేస్తున్నాయి. రూ. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన బేబీ తాజాగా 50 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. కేవలం 8 రోజుల్లోనే ఈ ఫీట్‌ను అందుకోవడం విశేషం. ఓ పెద్ద స్టార్‌కు సాధ్యం కాని ఈ 50 కోట్ల గ్రాస్‌‌ను బేబీ సాధించింది. ఇప్పటికీ థియేటర్స్‌కు జనం పరుగులు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు కనబడుతున్నాయి. దీంతో బేబీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.





 


 


ఊహించని విధంగా బేబీ కలెక్షన్స్ రావడంతో నటీనటులు రెమ్యూనరేషన్‌పై చర్చ మొదలైంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి, సెకండ్ హీరోగా చేసిన విరాజ్‌‌కు రెమ్యూనరేషన్స్‌పై ఎంత ఇచ్చారన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఆనంద్ దేవరకొండకు రూ.80 లక్షలు, వైష్ణవికి రూ.30 లక్షలు, విరాజ్‌కు రూ.20 లక్షలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమా భారీ హిట్ కావడంతో వారికి రెమ్యూనరేషన్ పెంచే అవకాశాలున్నాయి. బేబీ చిత్రానికి ఎస్‎కె‎ఎన్ నిర్మాతగా వ్యవహరించారు.


Tags:    

Similar News