బేబీ సంచలనం.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే..

Update: 2023-07-15 07:48 GMT

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష, సీత కీలక పాత్రలు పోషించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించిన బేబీ చిత్రం జూలై 14వ తేదీన రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన బేబీ మూవీకి మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్లలో దూసుకుపోతోంది. రిలీజైన మొదటి రోజే భారీ వసూళ్లు దక్కించుకుంది.

బేబీ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. నైజాంలో రూ. 1.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 31 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 42 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 2.60 కోట్లు షేర్ రాబట్టింది. మొత్తంగా రూ. 4.65 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఏపీ, తెలంగాణలో తొలి రోజు రూ. 2.60 కోట్లు షేర్ రాబట్టిన బేబీ కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో రూ. 16 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 72 లక్షలు కొల్లగొట్టింది. ఈ లెక్కన సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 3.48 కోట్లు షేర్‌, రూ. 6.55 కోట్లు గ్రాస్ రాబట్టింది. బేబీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లు కాగా ఫస్ట్ డేనే రూ. 3.48 కోట్లు వచ్చాయి. ఈ ప్రకారం చూస్తే రూ. 4.52 కోట్లు రాబడితేనే సరిపోతుంది.




Tags:    

Similar News