బేబీలో ఫెయిల్.. ఈ సారైనా కలుస్తారా..

Update: 2023-10-09 11:16 GMT

ఈ యేడాది అనూహ్య విజయం సాధించిన సినిమా బేబీ. బోల్డ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కాస్త అటూ ఇటూగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అటు ఓటిటితో పాటు శాటిలైట్ లో కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన వారందరికీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ కూడా వచ్చింది. హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మంచి ఆఫర్స్ కూడా మొదలయ్యాయి. విరాట్ అశ్విన్ కూడా బిజీ అవుతున్నాడు. ఇప్పటికే హీరోగా ప్రూవ్ చేసుకున్న ఆనంద్ దేవరకొండలోని మంచి నటుడుని కూడా చూపించింది బేబీ. ఈ మూవీలో వైష్ణవి, ఆనంద్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినా వీరి లవ్ స్టోరీ సక్సెస్ కాలేదు. అయినా ఈ సారి డ్యూయొట్ పాడతాం అంటూ రాబోతున్నారు.

ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ గం గం గణేశా. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. తర్వాత మిథున్ అనే కొత్త దర్శకుడితో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ మూవీలో హీరోయిన్ గా చాలామందిని ఆడిషన్ చేసి చివరికి మళ్లీ వైష్ణవి చైతన్యనే తీసుకున్నారు. ఈ చిత్రానికి ‘డ్యూయొట్’ టైటిల్ ఫిక్స్ చేశారు.

డ్యూయొట్ ఎలా ఉన్నా ఈ జోడీకి ఉండే క్రేజ్ వల్ల ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ అయితే గ్యారెంటీగా వస్తాయి. మంచి కంటెంట్ కూడా ఉంటే మరో బ్లాక్ బస్టర్ వీరి అకౌంట్ లో పడుతుంది. బేబీలో ఆనంద్ పాత్ర కాస్త విషాదంగా ఎండ్ అవుతుంది. ఆ పాత్రకు చాలా సింపతీ కూడా వచ్చింది. మరి ఈ సారి అలాంటిదేం లేకుండా మంచి డ్యూయొట్స్ పాడుతూ.. తనూ రొమాన్స్ చేస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News