చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించిన సినిమా బలగం. ఆ సినిమాలోని ప్రతీ పాత్ర, కథకు వ్యక్తిగతంగా జనాల కనెక్ట్ అయింది. కాగా ఆ సినిమాలో సర్పంచ్ పాత్ర పోషించిన యాక్టర్ నర్సింగం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నర్సింగం.. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని, గుర్తులను గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ‘నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు.. మొదటగా నర్సింగం బాపునే కలిసాను. ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం’ అంటూ బలగం సినిమా రోజులు తలచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు వేణు. నర్సింగం మరణ వార్త విన్ని పలువురు నటులు సంతాపం వ్యక్తం చేశారు.
నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి 🙏
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) September 5, 2023
మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి🙏
బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం..🙏 pic.twitter.com/smDHR8ULyU
Full View