బలగం సినిమా ఓటీటీ, టీవీల్లో కూడా వచ్చేసింది. మూవీ పాత బడిపోయినా దాని హవా మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే 100 అంతర్జాతీయ అవార్డులతో ఈ మూవీ రికార్డు సృష్టించింది. అయినా దీన్ని జోరు మాత్రం తగ్గలేదు. ఈ రోజుకీ ఏదో ఒక అవార్డ్ దక్కించుకుంటూనే ఉంది. ఈ సినిమా తాజాగా మరో అవార్డు దక్కించుకునేందుకు సిద్ధమైంది. ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో హాలీవుడ్ సినిమాలతో బలగం పోటీ పడుతోంది.
ఈ విషయాన్ని మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఫీచర్ కేటగిరీలో ఈ సినిమా నామినేషన్‌లో నిలిచింది. అవతార్: ది వే ఆఫ్ వాటర్, టాప్‌గన్: మావెరిక్, లాంటి సినిమాలు పోటీపడుతున్న ఫెస్టివల్‌కు ‘బలగం’ నామినేట్ కావడంపై దిల్ రాజు ప్రొడక్షన్స్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ ఫెస్టివల్‌లో 82 దేశాల నుంచి 1074 సినిమాలు పలు విభాగాల్లో పోటీ పడుతున్నాయి. అక్టోబరు 14న క్రొయోషియాలో జరగనున్న వేడుకలో విజేతలను ప్రకటిస్తారు. కేవలం సంగీతానికి సంబంధించి మాత్రమే ఈ అవార్డులు ఇస్తారు.
A Resonant Victory! 🌍#Balagam and #BheemsCeciroleo create history with a
— Dil Raju Productions (@DilRajuProdctns) September 8, 2023
‘𝘽𝙚𝙨𝙩 𝙊𝙧𝙞𝙜𝙞𝙣𝙖𝙡 𝙎𝙘𝙤𝙧𝙚 - 𝙁𝙚𝙖𝙩𝙪𝙧𝙚’
nomination at the International Sound and Film Music Festival in Croatia @isfmf_dreamaker ❤️🔥
- https://t.co/hmKRCTSc42 pic.twitter.com/EW7iUQZBpI
కాగా జబర్దస్త్ వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిన్న సినిమా బలగం. ఫ్యామిటీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ అందరినీ కదిలించింది. గ్రామాల్లో తెరలు కట్టీ మరీ ఈ సినిమాను ప్రదర్శించారు. తరువాత ఓటీటీ, టీవీల్లో కూడా ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్‌రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. భీమ్స్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.