Bandla Ganesh : రెచ్చిపోయిన బండ్ల గణేష్..ముస్లిం మహిళను బూతులు తిడుతూ..

Byline :  Vinitha
Update: 2024-02-18 02:36 GMT

బండ్ల గణేష్..సినిమాలు, రాజకీయాలు కంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. స్టేజీపై ఆయన స్పీచులు కానీ, ఎక్కడ ఏం మాట్లాడిన వైరల్ అవుతునే ఉంటుంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా, భక్తుడిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈవెంట్, ఇంటర్యూ ఏదైనా ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రోడ్యూసర్ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా ప్రజలలో పేరు సంపాదించుకునేందుకు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే బండ్ల గణేష్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఒక ముస్లిం దంపతులకు బండ్ల గణేష్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. తన ఆఫీసుకు వచ్చిన ముస్లిం దంపతులను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు బండ్ల గణేష్ మాట్లాడుతుండగా..మరొకవైపు తన అనుచరులు ఘర్షణకు దిగడం అందులో ఉంది. చివరికి బండ్ల గణేష్ కూడా అక్కడున్న దంపతులను అసభ్యంగా బూతులు తిట్టినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వాగ్వాదం అంతా కేవలం ఒక ఇంటి స్థలం నుంచి వారిని ఖాళీ చేయించే ప్రయత్నంలోనే ఇలా చేస్తున్నట్టుగా సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో...పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది బండ్ల అన్న రౌడీయిజం అని ఒకరంటే.. మహిళలపై దౌర్జన్యం చేయడం దేనికి సంకేతం అంటూ మరికొందరు కామెంట్ చేశారు. తక్షణమే ఆ మహిళకు న్యాయం చేయాలంటూ పలువురు నెట్టి జెన్స్ సైతం డిమాండ్ చేశారు.


Tags:    

Similar News