పల్లవి ప్రశాంత్పై పలు సెక్షన్ల కింద కేసు

By :  Bharath
Update: 2023-12-18 10:15 GMT

ఎంతో అట్టహాసంగా మొదలై 15 వారాల పాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. నిన్న రాత్రి ముగిసింది. మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ పోటీ పడగా.. ఫైనల్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ కప్పు ఎగరేసుకుపోయాడు. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు రచ్చ చేసిన విషయం తెలిసిందే. రన్నరప్ అమర్ దీప్ కారుపై అభిమానులు దాడి చేశారు. దీంతో ఇరువురి అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. రెచ్చిపోయిన అభిమానులు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వసం చేశారు. ఆరు బస్సులు, ఓ పోలీస్ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలను అభిమానులు ధ్వంసం చేశారు. దీంతో అర్థరాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడి పరిస్థితులను అదుపోలోకి తెచ్చుకునేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. ఈ గొడవపై పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ ఘటపపై పోలీసులు విజేత పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫైనల్స్ తర్వాత జరిగిన ర్యాలీలో పలువురు కంటెస్టెంట్ల కార్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ పై సుమోటోగా కేసు బుక్ చేశారు. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. అలాగే పలువురు అభిమానులపైనా కేసులు పెట్టినట్లు తెలుస్తోంది.





Tags:    

Similar News