తొలి చిత్రం `ఆర్ఎక్స్ 100`తోనే పెద్ద హిట్ కొట్టి బ్రేక్ అందుకున్నాడు హీరో కార్తికేయ. ఆ తర్వాత చేసిన ఏడు సినిమాల్లో.. రెండు విలన్ రోల్స్ చేసినా ఒక్క మూవీ కూడా ఆడలేదు. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ సారి `బెదురులంక 2012` అంటూ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ తో వస్తున్నాడు. యుగాంతం అనే కాన్సెప్ట్ కి వినోదాన్ని మేళవించి చేసిన చిత్రమిది. క్లాక్స్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన `డీజే టిల్లు` ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. నేడు శుక్రవారం(ఆగస్ట్ 25)న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా బాగుదంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్‌లు పెడుతున్నారు. కామెడీ వర్కవుట్ అయిందని, డైరెక్టర్ ఫస్ట్ ఎటెంప్ట్‌లోనే సక్సెస్ అయ్యాడని అంటున్నారు.
కాన్సెప్ట్ ఇదీ..
2012 సంవత్సరంలో యుగాంతం అవుతుందాని వార్తలు వినిపించాయి. ఆ సమయంలో బెదురులంక అనే చిన్న పల్లెటూరులో జరిగిన కథే బెదురులంక2012. యుగాంతం జరుగుతుంది అని నమ్మిన బెదురులంక ప్రజలు ఆ సమయంలో ఎలా ప్రవర్తించారు? వారు ఎదుర్కొన్న పరిస్థితులేంటి? యుగాంతం ఆపడానికి వాళ్ళు ఎం చేశారు? అందులో హీరో పాత్రఏంటి? అనేది మిగిలిన కథ.
తెలిసిన కథే కానీ..
యుగాంతం నేపథ్యంలో ఇతర దేశ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి. అయితే అవన్నీ యాక్షన్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు. కానీ దాన్ని ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ చిత్ర దర్శకుడు క్లాక్స్. తలిసిన కథే అయినప్పటికి దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. ప్రజల వీక్‌నెస్‌ని పెద్దలు ఎలా వాడుకుంటారో, మతాల పేరుతో వారిని ఎలా ఆడుకుంటారో కూడా ఈ చిత్రంలో చూపించారు. దేవుడి పేరుతో చేసే మోసాలను ఇందులో అంతర్లీనంగా చూపించారు. ఎవరికోసమే కాదు, మనకోసం మనం బతకాలనే సందేశాన్నిచ్చాడు. యుగాంతాన్ని యాక్షన్, (Bedurulanka 2012 Movie Review) థ్రిల్లర్ జోనర్‌లో కాకుండా వినోదాత్మకంగా చెప్పాలనే ఆలోచనతోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యారు. తొలి దర్శకుడైనా సినిమాని బాగా డీల్ చేశాడు.
ఫుల్ ఎంటర్‌టైనర్
శివ పాత్రలో కార్తికేయ అదరగొట్టాడు. బాడీ లాంగ్వేజ్ కూడా కాస్త కొత్తగా ట్రై చేశాడు. ఇక పల్లెటూరి అమ్మాయిగా నేహ శెట్టి కనిపించింది.నిజానికి చెప్పాలంటే ఈ సినిమాను కాపాడింది కామెడీ అనే చెప్పాలి. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, జబర్దస్త్ రాంప్రసాద్, గెటప్ శ్రీను, సత్య, కశీరాజు చేసిన కామెడీ నెక్స్ట్ లెవల్లో పండింది. ఓపక్క కథను నడిపిస్తూ.. మరోపక్క కామెడీని జెనెరేట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. దీంతో ఆడియన్స్ ఫుల్ గా ఎంటర్టైన్ అవడం గ్యారంటీ. సినిమాను మొదలుపెట్టడం డైరెక్ట్ కథలోకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా చేశారు దర్శకుడు. సినిమాలో పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గానీ సూపర్ గ ప్లస్ అయ్యాయి. మొత్తంగా బెదురులంక 2012 సినిమా బాగుంది.