పవన్ కళ్యాణ్ టైటిల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా

Byline :  Babu Rao
Update: 2024-01-02 08:45 GMT

పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం లేదు కానీ.. ఆయన చేసిన సినిమాల టైటిల్స్ మాత్రం వాడబడుతూనే ఉన్నాయి. అంటే ఇది పవన్ కళ్యాణ్ నటించిన పాత సినిమా టైటిల్

కాదు. అతని కొత్త సినిమాకు పెడదాం అనుకున్న టైటిల్. ఆ పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఏంటీ ఆ టైటిల్ ఏంటీ అనే కదా.. ఈ

బుధవారం శ్రీనవాస్ బర్త్ డే. ఈ సందర్భంగా తన లేటెస్ట్ మూవీస్ అప్డేట్స్ ను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అప్పట్లో ఒకడుండేవాడు మూవీ ఫేమ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు శ్రీనివాస్. దీంతో పాటు మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీతో ఆకట్టుకున్న మున్నా ఈ చిత్రానికి దర్శకుడట. ఇదో సోషియో ఫాంటసీ అంటున్నారు. దేవుడే దిగి వచ్చినా అనేది టైటిల్.

ఈ టైటిల్ తో ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి ఉండాల్సింది. కానీ ఎందుకో అంత పెద్ద టైటిల్ వద్దు అనుకుని.. ‘బ్రో’ అంటూ సింపుల్ గా వచ్చేశారు. యస్.. పవన్ కళ్యాణ్, సాయితేజ్ హీరోలుగా సముద్రఖని డైరెక్ట్ చేసిన బ్రో మూవీకి ముందుగా అనుకున్న టైటిల్ దేవుడే దిగి వచ్చినా. వాళ్లు వదులుకున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీకి సెట్ చేస్తున్నారు. అదన్నమాట సంగతి. ఈ మూవీ ఈ యేడాది చివర్లో కానీ వచ్చే యేడాది ఆరంభంలో కానీ సెట్స్ పైకి వెళుతుందట. ఇవి కాక నాంది, ఉగ్రమ్ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలోనూ రాక్షసుడు2 చేస్తున్నాడు శ్రీనివాస్. మొత్తంగా లైనప్ బానే ఉంది. కాకపోతే ఎటొచ్చీ ఆ హిట్ అనే మాట రావడం లేదీ శ్రీనివాస్ కు.

Tags:    

Similar News