ఓటీటీలోకి ఊరి పేరు భైరవకోన...స్ట్రీమింగ్ ఎక్కడంటే?

By :  Vinitha
Update: 2024-03-08 03:21 GMT

ఈ మధ్య ఓటీటీకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. థియెటర్ లో రిలీజ్ అయిన ఏ సినిమా అయిన సరే కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. వీకెండ్ వస్తే సినిమా ప్రియులకు పండగే. ఓటీటీలో రిలీజ్ అయిన మూవీని ఫ్యామిలీతో పాటు కలిసి చూసేస్తుంటారు. బాష ఏదైనా సరే సినిమా బాగుంటే దాన్ని ఆదరిస్తారు. ఈ మధ్య హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీలను బాగా ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఎలాంటి సమాచారం లేకుండా ఓ హారర్ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

సందీప్ కిషన్ హీరోగా నటించిన హారర్ మూవీ 'ఊరి పేరు భైరవకోన'. ఫిబ్రవరి 16న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ చాలా కాలంగా వాయిదాలు పడుతూ వచ్చింది. పాజిటివ్ టాక్ తో చాలా కాలం తర్వాత సందీప్ కిషన్ కు హిట్ తీసుకువచ్చింది. అయితే రిలీజైన 21 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ముందు జీ5 లో స్ట్రీమింగ్ అవుతుందన్న..కానీ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఇంకేందుకు ఆలస్యం థియెటర్స్ లో మిస్ అయిన వారు ఉంటే వెంటనే ఓటీటీలో చూసేయండి.

Tags:    

Similar News