ఆ రోజే భోళా శంకర్ టీజర్ విడుదల

Update: 2023-06-22 13:13 GMT

మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం మూవీకి రీమేక్‍గా భోళా శంకర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, మొదట లిరికల్ సాంగ్ సినిమా అంచనాలను రెట్టింపు చేశాయి.

మరోసారి మాస్ లుక్‎లో కనబడనున్న మెగాస్టార్ చిరంజీవి కోసం ఆభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా నుంచి మరో సూపర్ అప్డేట్ వచ్చింది. భోళా శంకర్ టీజర్‌ను జూన్ 24న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. “జూన్ 24న భోళా శంకర్ టీజర్‌ వచ్చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మెగా సెలెబ్రేషన్‍కు, భారీ ఉత్సాహానికి సిద్ధంగా ఉండండి" అంటూ ఏకే ఎంటర్‌టైన్‍మెంట్ ట్వీట్ చేసింది.

గ్యాంగ్‍స్టర్ నుంచి ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన పాత్రలో భోళా శంకర్‌లో చిరంజీవి కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, చెల్లి పాత్రను స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ పోషిస్తోంది. కేఎస్ రామారావు, రామ్‍బ్రహ్మం సుంకర.. భోళా శంకర్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది.


Tags:    

Similar News