డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు..ఆషురెడ్డి ఫైర్

Update: 2023-06-24 02:58 GMT

హైదరాబాద్‎లో డ్రగ్స్ ముఠా మరోసారి కలకలం రేపింది. సైబరాబాద్ పరిధిలో శుక్రవారం డ్రగ్స్ మాఫియా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం కబాలి సినిమా నిర్మాత కేపీ చౌదరిని కూడా డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్‎లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఆ రిమాండ్ రిపోర్ట‏లో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉండటంతో తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్‌ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. విచారణలో కేపీ చౌదరి ఫోన్‎లో ఉన్న 9000 ఫొటోలు, కాంటాక్స్‎ను, కాల్ డేటాను డీ కోడ్ చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ప్రధానంగా తెలుగు బిగ్ బాస్ బ్యూటీ ఆషురెడ్డి పేరు ఈ కేసులో బాగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‎గా మారింది. ఈ క్రమంలో ఆషురెడ్డి ఈ విషయంపై ఇన్‏స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటి నటి మండిపడుతోంది.




 


"డ్రగ్స్ కేసులో నాపై వస్తున్న రూమర్స్‏లో ఎలాంటి నిజం లేదు. మీడియాలో చెబుతున్నట్లు నాకు ఎవరితోనూ డ్రగ్స్ డీలింగ్స్ లేవు. నాపై వస్తున్న వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలే. ఈ కేసులో అవసరమైతే విచారణను ఎదుర్కొంటాను. అధికారులకు అసలు విషయం చెబుతాను. కానీ నా పర్మీషన్ లేకుండా నా ఫోన్ నెంబరు బహిరంగంగా ప్రదర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు". అని ఆషు రెడ్డి తన ఇన్‎స్టాగ్రామ్ అకౌంట్‎లో పోస్ట్‎ను షేర్ చేసింది.



ఆషురెడ్డి డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ కేపీ చౌదరితో వందల ఫోన్ కాల్స్‎లో మాట్లాడిందని రిమాండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆషుకు ఈ డ్రగ్స్ మాఫియా గ్యాంగ్‎తో సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అన్న రూమర్స్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఆ కోణంలోనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపనున్నట్లు తెలుస్తోంది. కానీ కేపీ చౌదరి కూడా ఆషుతో తనకు ఉన్న రిలేషన్ గురించి ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ఆధారాలు కనుక లభిస్తే ఆషును కూడా ప్రశ్నించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.  




 




 




 


 

 

Tags:    

Similar News