LEO Full Movie HD: "లియో" సినిమాకు భారీ షాక్.. ఆన్‌లైన్‌లో ఫుల్ HD మూవీ

Update: 2023-10-19 04:40 GMT

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన లియో మూవీ గురువారం భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఖైదీ, విక్ర‌మ్ సినిమాల‌తో ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసిన లోకేష్ క‌న‌క‌రాజ్ లియో మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్రిష, సంజయ్ దత్, అర్జున్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే విడుదలైన కొద్ది సేపటికే చిత్ర బృందానికి భారీ షాక్ తగిలింది. మొదటి నుంచి ఎంతగానో హైప్ ఉన్న ఈ మూవీ.. HD క్వాలీటితో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. తమిళ్‌రాకర్స్, టెలిగ్రామ్, మూవీ రుల్జ్ వంటి సైట్లలో ఈ సినిమా పూర్తి HD క్వాలిటీతో అందుబాటులో ఉండటంతో చిత్ర నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

మరో వైపు ఇప్పటికే సినిమా చూసిన అభిమానులు.. సోషల్ మీడియాలో భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. లియో సినిమా స్టోరీ ఏం అర్థం కాలేదని అంటున్నారు. తర్వాతి సినిమాతో అయినా లోకేష్ కనకరాజ్ కమ్ బ్యాక్ హిట్ కొడతాడు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తమిళోడు హిట్ కొట్టుకుని వెళ్లాడు. అది విజయ్ పవర్ అని మరికొందరు అంటున్నారు. హాలీవుడ్ మూవీ హిస్ట‌రీ ఆఫ్ వ‌యోలెన్స్ ఆధారంగా లియో మూవీ రూపొందిన‌ట్లు నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. లియో టైటిల్ కార్డ్స్‌లో హిస్ట‌రీ ఆఫ్ వ‌యెలెన్స్‌ను ట్రిబ్యూట్ కార్డ్ వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. హాలీవుడ్ మూవీ స్ఫూర్తి అని ఇన్‌డైరెక్ట్‌గా సినిమా యూనిట్ ఒప్పుకున్నంద‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. లియో మూవీని రొటీన్ స్టోరీతో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడని విమర్శలు వినిపిస్తున్నాయి. కథ కంటే ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్‌ల‌పైనే డైరెక్ట‌ర్ ఫోక‌స్ పెట్టాడ‌ని నెగెటివ్ కామెంట్స్ వ‌స్తున్నాయి.

Tags:    

Similar News