విచారణలో వెలుగులోకి కీలక అంశాలు.. అన్నదమ్ములిద్దరూ మోసం చేశారు

By :  Bharath
Update: 2024-02-22 16:44 GMT

యూట్యూబ్ స్టార్ షణ్ముక్, సంపత్ కేసు పోలీస్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్ లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి.. షణ్ముక్ తనను మోసం చేశాడని బాధితురాలు మౌనిక పోలీసులకు తెలిపింది. షణ్ముక్ తో పాటు ఆయన సోదరుడు సంపత్ వినయ్‌పై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్‌లోని షణ్ముల్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలో వారి ఇంట్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు పోలీసులకు దొరికాయి. అన్నదమ్ములీద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. సంపత్ ఆ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినట్లు నిర్ధారణ అయింది. దాంతో పాటు వీరిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి తాగినట్లు తేలింది.

షణ్ముక్ సోదరుడు సంపత్ తనపై పలుమార్లు లైగింక దాడి చేశాడని మౌనిక ఆరోపించింది. హోటల్స్, విల్లాలకు తిసుకెళ్లి తననను బెదిరించి తన పై లైంగిక దాడి చేశాడని చెప్పింది. దీంతో సంపత్ ను పెండ్లి చేసుకోమని బలవంత పెట్టగా..రింగ్ తొడిగి పెండ్లి అయిపోయింది అన్నాడని తెలిపింది. అంతేగాక ఓసారి బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది. అయితే అబార్షన్ విషయం బయటికి చెప్పొదని తనని షణ్ముఖ్ సోదరుడు తనను బెదిరించాడని తెలిపింది. సంపత్ మరో పెండ్లి చేసుకున్నాడని తెలిసి..పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పింది. షణ్ముఖ్ దగ్గర గంజాయి, డ్రగ్స్ ఫిల్స్ కూడా ఉన్నాయని ఆరోపించింది. ఓ సారి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఇద్దరూ గంజాయి తీసుకుంటున్నారని ఫిర్యాదులో యువతి చెప్పింది.

కాగా షణ్ముక్‌ దగ్గర దొరికిన గంజాయి, మత్తు పద్థాలను పోలీసులు సీజ్‌ చేశారు. సంపత్ వినయ్‌ పై చీటింగ్‌, రేప్‌ కేసులు నమోదు చేశారు. 16 గ్రాముల గంజాయి దొరకడంతో షణ్ముక్‌ను కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా, షణ్ముక్‌ దగ్గర గంజాయితో పాటు డ్రగ్స్‌ పిల్స్‌ కూడా ఉన్నాయని, వాటికి సంబంధించి వీడియో ప్రూఫ్‌లు తన దగ్గర ఉన్నాయని ఫిర్యాదులో తెలిపింది. జావెద్‌ అనే కానిస్టేబుల్‌ కూడా షణ్ముక్‌కు సహకరించేందుకు ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది. తనను కాంప్రమైజ్‌ అవ్వమని కానిస్టేబుల్‌ జావెద్‌ ఒత్తిడి తీసుకొచ్చాడని పేర్కొంది. తనకు న్యాయం జరగాలని, తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పింది.




Tags:    

Similar News