హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ జంటపై పలు రూమర్స్ వైరల్ అయ్యేవి. మహాసముద్రంలో సినిమాలో కలిసి నటించిన ఆ జంటపై నెట్టింట కామెంట్స్ జోరుగా వినిపించాయి. ఆ మూవీ షూటింగ్‌లోనే ప్రేమ మొదలవడంతో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ జంట నిన్న రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో అందరి నోళ్లూ మూతపడ్డాయి. వనపర్తి శ్రీరంగపురం ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లిపై సిద్ధార్థ్, అదితి రావు నుంచి ఇంకా ఏ అనౌన్స్‌మెంట్ రాలేదు.
తాజాగా ఈ జంట పెళ్లిపై ఫిలిం ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతోంది. సిద్ధార్థ్, అదితి రావు ఇద్దరూ సినిమా షూటింగ్ అని చెప్పి పెళ్లి చేసుకున్నారట. వనపర్తి సంస్థాన చివరి రాజు జే రామేశ్వర రావు కూతురు అతిథి రావు హైదరి తల్లి ‘విద్యారావు’ అని చాలా మందికి తెలియదు. దీంతో వారి వారసత్వంతోనే పెళ్లిని వనపర్తిలో నిర్వహించారు. పెళ్లికి జే రామేశ్వర రావు వారసులు జే కృష్ణదేవర రావు ఫ్యామిలీ మొత్తం వచ్చిందట. వారి పెళ్లి చేయడం కోసం తమిళనాడు నుంచి పూజారులు కూడా వచ్చారట.
పెళ్లి జరుగుతుంటే అక్కడున్న స్థానిక పూజారులు, భక్తులు అందరూ షూటింగే అని అనుకున్నారట. కానీ ఇప్పుడు అది నిజమైన పెళ్లి అని తెలియడంతో షాక్ అవుతున్నారట. ప్రస్తుతం నెట్టింట సిద్ధార్థ్, అదితిరావు హైదరి పెళ్లికి సంబంధించిన డెకరేషన్ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ పెళ్లి నిజమేనని తెలియాలంటే సిద్ధార్థ్, అదితి నోరువిప్పాల్సిందే. అప్పుడే అందరికీ క్లారిటీ వస్తుంది.
పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరి
— Telugu Scribe (@TeluguScribe) March 27, 2024
పెబ్బేరు మండలం శ్రీ రంగాపురంలోని శ్రీ రంగనాయక ఆలయంలో సినీ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరి వివాహం చేసుకున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో అత్యంత రహస్యంగా వివాహం.
సినిమా షూట్ అని ముందుగా చెప్పినట్లు… pic.twitter.com/QIRUdNUXuP