నేను నీకంటే పెద్ద నటుడిని.. రైతు బిడ్డకు ఇచ్చిపడేసిన అమర్ దీప్

Byline :  Aruna
Update: 2023-09-12 04:36 GMT

బిగ్ బాస్ సీజన్ 7 మంచి రసవత్తరంగా సాగుతోంది. రెండో వారం నామి నామినేషన్స్ ప్రాసెస్‎లో కంటెస్టెంట్‎లు కొట్టుకోవడమే ఒక్కటే తక్కువ. బిగ్ బాస్ ఇళ్లు పీకి పందిరి వేశారు. జనాలను ఎంటెర్టైన్ చేయడానికి బిగ్ బాస్‎కు వెళ్లారో లేక ఒకరిని ఒకరు దూషించుకోవడానికి వెళ్లారో అర్ధం కావడం లేదు. ఒక్కసారిగా ఇంటి సభ్యులందరు కలిసి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌పై విరుచుకుపడ్డారు. నేను రైతు బిడ్డ అని తరచుగా ప్రశాంత్ అంటుంటే అమర్ దీప్‎కు కాలి గట్టిగా ఇచ్చిపడేసాడు. "నువ్వు పదే పదే రైతు బిడ్డ.. రైతు బిడ్డ అని చెప్పకు. నీకు ఓ లక్ష ఇస్తే..మరో రైతుకి ఇస్తాను అని అంటావ్. కానీ, వారి స్థానంలో ఓ రిక్షా అతను, లారీ డ్రైవర్ ఉంటాడు.. వారికి మాత్రం డబ్బులు ఇస్తానని ఎందుకు చెప్పవ్ " అంటూ పూనకం వచ్చినట్లుగా ఓ రేంజ్‎లో ఊగిపోయాడు.

ఒక్కసారి అమర్ దీప్ ఇచ్చిపడేయడంతో ప్రశాంత్‎కు ఏం చేయాలో తెలియక..పుష్ప సినిమాలో అల్లు అర్జున్‎లాగా గా భుజం ఎత్తాడు. దీంతో మరోసారి "భుజం దించు.. భుజం దించు నేను మాట్లాడుతున్నాను కదా" అంటూ అమర్‎దీప్ ఆవేశంతో ఊగిపోయాడు. ఈ లోపు అన్నా చలి పెడుతోంది అని ప్రశాంత్ అనగా ‘ఇప్పుడు నువ్వు అల్లూ అర్జున్‎లా భుజం ఎత్తావ్ కదా.. ఇదే బాడీ లాంగ్వేజ్‌తో అన్నా నేను బిగ్ బాస్‌కి వస్తా అని ఎందుకు చెప్పలేదురా".. అంటూ రైతు బిడ్డను ఓ బంతి ఆడుకున్నట్లు ఆడుకున్నాడు అమర్ దీప్.

" రైతుకు మాత్రమే కష్టం కాదు, నిజానికి బీటెక్ చదివినోడు పడే కష్టాలు నీకేం తెలుసు? మంచి చదువు చదివి జాబ్‎లు లేక ఊరికి వెళ్లి, ఏ ఉద్యోగం చేస్తున్నామో తెలియక తినేందుకు తిండి లేక చచ్చిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్లకి ఏం చెప్తావ్? నువ్వు నా దగ్గర యాక్ట్ చేయకు..నేను నీకంటే పెద్ద యాక్టర్‏ని అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయాడు అమర్ దీప్.





Tags:    

Similar News