Bigg Boss Season 7 : పల్లవి ప్రశాంత్ ఇజ్జత్ తీసిన నాగార్జున

By :  Kiran
Update: 2023-09-16 12:36 GMT

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెకండ్ వీకెండ్ వచ్చేసింది. కంటెస్టెంట్లకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు చేసిన తప్పులకు క్లాస్ పీకేందుకు హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. గతవారం హౌస్లో కంటెస్టెంట్ వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ చురకలంటించారు. ఈ వీకెండ్ కింగ్స్ మీటర్ తీసుకొచ్చిన నాగార్జున శుక్రవారం వరకు బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరి ఆటతీరు ఎలా ఉందో అందులో చూపించారు.

ముందుగా శివాజీతో మాట్లాడిన నాగార్జున ఆయన ఆటతీరు బాగానే ఉందంటూనే కింగ్స్ మీటర్లో సగం మార్కులే వచ్చాయని చెప్పాడు. ప్రతి చిన్న విషయానికి డోర్ తీయండి సామి అనడం ఏం బాగోలేదని హితవు పలికారు. ‘పులి మీద స్వారీ చేస్తున్నప్పుడు మధ్యలో దిగకూడదు’ అని సలహా ఇచ్చాడు. మాటిమాటికి వయసుకు తగ్గట్లు ఆడుతున్నానన్న షకీలాకు నాగ్ క్లాస్ తీసుకున్నారు. వయసు అనేది మన ఆలోచనను బట్టి ఉంటుందని అన్నారు. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్‌ చేసేటప్పుడు అమర్ దీప్‌ మాట్లాడిన మాటలను నాగార్జున తప్పుబట్టారు. అతనికి వచ్చే డబ్బులు ఎవరికి ఇవ్వాలన్నది అతని ఇష్టం అని చెప్పాడు.

ఇక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఇజ్జత్ తీశాడు నాగార్జున. బిగ్ బాస్ ప్రశాంత్కు ఇచ్చిన మొక్క ఎండిపోవడంతో ఓ మొక్కను సరిగా చూసుకోలేని వాడు రైతుబిడ్డా’ అని క్లాస్‌ పీకాడు. రైతుబిడ్డను అని చెప్పుకోవడం కాదు చేతల్లో చూపించాలని నాగార్జున సలహా ఇచ్చాడు

Tags:    

Similar News